ఎండల్లో హాయిహాయిగా!
కాలం ఏదైనా యువత సొగసులతో చెలరేగిపోవడానికి అనుకూలమే. ఇప్పుడేమో ఎండాకాలం ముంచుకొస్తోంది.
కాలం ఏదైనా యువత సొగసులతో చెలరేగిపోవడానికి అనుకూలమే. ఇప్పుడేమో ఎండాకాలం ముంచుకొస్తోంది. స్టైల్‌ని మండిస్తూనే ఒంటికి సౌకర్యంగా ఉండే ఔట్‌ఫిట్స్ ఏంటో తెలుసుకుంటే మంచిదేగా.
* వదులు సిల్హౌట్స్: వేసవి మొత్తం ఎండవేడితో సతమతమవుతాం. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. వదులు దుస్తులు వేస్తే ఈ బాధలకు చెక్ పెట్టినట్టే. పైగా సౌకర్యంగా ఉంటాయి. వదులు సిల్హౌట్ దుస్తులు ఒంట్లో వేడిని తొలగిస్తాయి. టియర్డ్ డ్రెస్‌లు, స్కర్టులు, స్లీవ్ డ్రెస్‌లు ట్రెండీగా ఉండటంతోపాటు సౌకర్యంగా ఉంటాయి.
* లేత రంగులు: ఈ కాలంలో అందరూ చెప్పే మాట.. లేత రంగులకే ఓటేయాలని. ఇందులోనూ తేలికైన బ్లూ, పింక్, తెలుపు ఆహ్లాదకరంగా ఉంటాయి. లేత రంగులు సూర్యకిరణాలను వికేంద్రీకృతం చేసి ఎండ నుంచి కాపాడతాయి.
* టోపీ: ఎండ మనపై పడకుండా ఉండాలంటే.. ఎండకు టోపీ పెట్టేలా టోపీని ధరించాల్సిందే. ఇది రక్షణగా ఉండటమే కాదు.. కుర్రకారు ఆధునికంగా కనిపించేలా చేస్తుంది.
* మెటీరియల్: ఎండాకాలంలో మనం ధరించే మెటీరియల్ సైతం సౌకర్యమా, అసౌకర్యమా తేల్చి చెబుతాయి. ముఖ్యంగా కాటన్, లినెన్ ఒంటికి చల్లదనాన్నిస్తాయి. పాలిస్టర్, నైలాన్‌లాంటి వాటి జోలికి వెళ్లొద్దు.
- అమ్మాయిలకు
* క్రాప్‌టాప్‌లు, ప్రింటెడ్ ప్యాంట్లు
* శారీ విత్ వైట్ షర్ట్
* ఫ్లోరల్ డ్రెస్‌లు
* క్రాప్‌టాప్, డెనిమ్ షార్ట్ అబ్బాయిలకు
* ప్రింటెడ్ చొక్కాలు, షార్ట్‌లు
* టై, డై డిజైన్లు, స్లిమ్ డార్క్ జీన్స్
* టర్ట్‌ల్ నెక్ టీషర్టులు
* చినోస్, తెలుపు రంగు టీషర్టులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం