April Fools Pranks: ప్రాంక్‌ చేస్తే..పడీపడీ నవ్వాల్సిందే!

ఈరోజేంటి? ఏప్రిల్‌ 1. ఫూల్స్‌ డే అని కూడా అంటుంటాం. నేడు మన దగ్గరి వాళ్లను సరదాగా ఫూల్‌ని చేస్తే ఎవరూ ఏమీ అనుకోరు కదా!

Published : 01 Apr 2023 00:16 IST

ఈరోజేంటి? ఏప్రిల్‌ 1. ఫూల్స్‌ డే అని కూడా అంటుంటాం. నేడు మన దగ్గరి వాళ్లను సరదాగా ఫూల్‌ని చేస్తే ఎవరూ ఏమీ అనుకోరు కదా! మరెందుకాలస్యం.. సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఈ ప్రాంక్స్‌ ప్రయత్నించి సరదాగా నవ్వుకోండి..

* పిల్లలో, స్నేహితులో కూర్చునే చోట సడెన్‌గా ఒక బెలూన్‌ పెట్టండి. అది పగిలినప్పుడు సరదాగా అందరూ నవ్వుకోవచ్చు.
* పిల్లో కవర్‌ తీసుకొని దిండుకి బదులు అందులో సరిగ్గా బెలూన్స్‌ అమర్చండి. దాన్ని ఉపయోగించేవారు పడే ఇబ్బందిని చూస్తే నవ్వు రాకుండా ఉంటుందా?
* ఇంట్లో ఎవరూ నిద్ర లేవకముందే. క్యాలెండర్‌, ఫోన్లలో తేదీలు మార్చండి. సమయం మార్చేయండి. పిల్లల్ని ముందే నిద్ర లేపి స్కూల్‌కి టైమ్‌ అయిందని ఫూల్‌ని చేయండి.
* డెస్కుల్లో ఉన్న వస్తువులన్నీ ఖాళీ చేసి ఓ చోట దాచండి. అవి ఏమయ్యాయో తెలియక హైరానా పడుతుంటే.. నవ్వుతూ ఒక్కొక్కటీ తీసి అందివ్వండి.
* టీవీ రిమోట్‌ తీసుకుని దాంట్లో బ్యాటరీలు తిరగేసి వేయడమో, సెన్సర్‌కి టేప్‌ అతికించడమో చేయండి. ఏమైందో అని వాళ్లు గాబరా పడుతుంటే నవ్వులే నవ్వులు.
* కాగితాల్ని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఫ్యాన్‌పైన జాగ్రత్తగా పెట్టండి. ఎవరైనా వచ్చి స్విచాన్‌ చేయగానే వారి పైన పడతాయి. వాళ్లు అయోమయంగా మొహం పెట్టినప్పుడు ఆటపట్టించండి.
* ఫ్రిజ్‌లో ఉన్న ప్రతి వస్తువుకి గూగ్లీ కళ్లని అతికించండి. ఎవరైనా ఆ ఫ్రిజ్‌ తెరిచినప్పుడు అన్నీ తమ వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రాంక్‌ భలే సరదాగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు