Vizag Beach: వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..

ఎప్పుడూ బంగారంలా మెరిసిపోయే విశాఖ ఆర్‌కే బీచ్‌లోని ఇసుక గురువారం నల్లగా మారిపోయింది. ఈ మార్పును చూసి సందర్శకులు ఆందోళన చెందారు. ఇసుక అలా ఎందుకు మారిందోనని భయంతో అటు

Updated : 12 Aug 2022 07:16 IST

ఎప్పుడూ బంగారంలా మెరిసిపోయే విశాఖ ఆర్‌కే బీచ్‌లోని ఇసుక గురువారం నల్లగా మారిపోయింది. ఈ మార్పును చూసి సందర్శకులు ఆందోళన చెందారు. ఇసుక అలా ఎందుకు మారిందోనని భయంతో అటు వైపు ఎవరూ అడుగు కూడా పెట్టలేదు. మాకు తెలిసినంత వరకు ఇలా ఎన్నడూ జరగలేదని స్థానికులు వివరించారు. దీనిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం భూవిజ్ఞానశాస్త్ర ఆచార్యులు ధనుంజయరావును సంప్రదించగా..‘సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకురావడం వల్ల ఇసుక ఇలా మారిపోతుంది. లేదా.. ఇనుప రజను ఎక్కువ శాతం సముద్రంలోంచి బయటికి వచ్చినప్పుడూ ఇలానే నల్లగా మారుతుంది. ఇసుకను పరిశోధిస్తేనే విషయం ఏంటో స్పష్టమవుతుంది’ అని వివరించారు.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని