AP EAPCET: నేటి నుంచి అందుబాటులో ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగ జనార్దన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు.

Updated : 09 May 2023 07:48 IST

అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగ జనార్దన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఏపీఈఏపీసెట్‌-2023 వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 2023 - ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్‌ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని