బెయిలు కోసం వై.ఎస్.భాస్కరరెడ్డి పిటిషన్
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈనాడు, హైదరాబాద్: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. సాక్ష్యాల చెరిపివేతలో తనకు ఎలాంటి సంబంధంలేదని భాస్కరరెడ్డి తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించిందన్నారు. అంతేగాకుండా తన ఆరోగ్యం సరిగా లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వివేకా హత్య కేసులో కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కరరెడ్డిని సీబీఐ ఏప్రిల్ 16న అరెస్టు చేసిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి