పటమటకు సబ్‌-రిజిస్ట్రార్‌ నియామకంలో నాన్చుడి వైఖరి

విజయవాడ నగరంలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడి వైఖరి అవలంబిస్తోంది.

Published : 06 Jun 2023 05:07 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ నగరంలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడి వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పటమట కార్యాలయం ఒకటి. ఇక్కడున్న సబ్‌-రిజిస్ట్రార్‌.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టు అయ్యారు. అనంతర పరిణామాల్లో భాగంగా గాంధీనగర్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ చైతన్యను పటమట కార్యాలయంలో తాత్కాలికంగా సర్దుబాటుచేశారు. తాజాగా సాధారణ బదిలీల్లో భాగంగా కొందరు సబ్‌-రిజిస్ట్రార్లకు స్థానచలనం కలిగింది. కానీ పటమట సబ్‌-రిజిస్ట్రార్‌గా ఎవర్నీ బదిలీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాగా డబ్బిచ్చే వారికి మాత్రమే ఇక్కడ పోస్టింగ్‌ ఇస్తారన్న అభిప్రాయం తొలి నుంచీ ఉంది. గత బదిలీల్లో ఈ కార్యాలయ పోస్టింగ్‌ వ్యవహారంలో ముగ్గురు డీఐజీలను ప్రధాన కార్యాలయానికి అటాచ్‌చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ బదిలీల ద్వారా ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ రాలేదా? ఎవరికో లబ్ధిచేకూర్చాలన్న ఉద్దేశంతో నియామకం చేయడంలేదా? అన్న దానిపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని