హైదరాబాద్‌లో అమ్ముడుపోని గృహాలు 39,191

హైదరాబాద్‌లో జనవరి-మార్చి త్రైమాసికం చివరకు అమ్ముడుపోని గృహాల సంఖ్య 39,191గా నమోదైంది. డిసెంబరు త్రైమాసికం చివరకు ఈ సంఖ్య 39,308గా ఉంది. 2021 తొలి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ విపణే ఉత్తమ పని తీరు కనబరిచిందని హౌసింగ్‌ బ్రోకరేజీ

Published : 03 May 2021 01:11 IST

8 ప్రధాన నగరాల్లో కలిపి 7.05 లక్షలు
విక్రయించడానికి మరో నాలుగేళ్లు పట్టొచ్చు
ప్రాప్‌ టైగర్‌ ‘రియల్‌ ఇన్‌సైట్‌’ నివేదిక

దిల్లీ: హైదరాబాద్‌లో జనవరి-మార్చి త్రైమాసికం చివరకు అమ్ముడుపోని గృహాల సంఖ్య 39,191గా నమోదైంది. డిసెంబరు త్రైమాసికం చివరకు ఈ సంఖ్య 39,308గా ఉంది. 2021 తొలి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ విపణే ఉత్తమ పని తీరు కనబరిచిందని హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ రూపొందించిన ‘రియల్‌ ఇన్‌సైట్‌’ నివేదిక వెల్లడించింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కలిపి మార్చి త్రైమాసికం ఆఖరుకు అమ్ముడుపోని గృహాలు 7,18,483 నుంచి 2 శాతం మేర తగ్గి 7,05,344గా నమోదయ్యాయి. ప్రస్తుత వేగంతో ఈ గృహాలన్నీ విక్రయించాలంటే మరో నాలుగేళ్లు సమయం పట్టొచ్చని నివేదిక అంచనా వేసింది.
* మొత్తం అమ్ముడుపోని గృహాల్లో 18 శాతం  చేరడానికి సిద్ధంగా ఉన్నవే.
* జనవరి-మార్చి త్రైమాసికంలో 8 ప్రధాన నగరాల్లో కలిపి 66,176 గృహాలు విక్రయమవగా, కొత్తగా నిర్మితమైనవి 53,037 ఉన్నాయి.
* ముంబయి, పుణెల్లో అమ్ముడుపోని గృహాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అందుబాటులో ఉన్న గృహాల్లో 54 శాతం వాటా ఈ రెండు నగరాల్లోనే ఉండటం గమనార్హం.
* దిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు నగరాల వాటా 15 శాతం, 10 శాతంగా ఉందని హౌసింగ్‌.కామ్‌, ప్రాప్‌ టైగర్‌ డైరెక్టర్‌ రీసెర్చ్‌ అంకితా సూద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని