మరో ఏడాది అదనపు వడ్డీ ‘అందుబాటు’!

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరల్లో గృహాల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని......

Published : 01 Feb 2021 17:52 IST

గృహ రుణాలపై వడ్డీరాయితీ పథకం గడువు పొడిగింపు

దిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరల్లో గృహాల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే 2022 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు ఈ రాయితీ వర్తిస్తుంది.

తొలిసారి రూ.45 లక్షల వరకు విలువైన గృహాన్ని కొనుగోలుచేసే వారికి అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగానికి చేయూతనిచ్చేందుకు తాజాగా ఈ గడువును పొడిగించారు. ఇకపై అందుబాటు ధరల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి గరిష్ఠంగా రూ.3.5 లక్షల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది.

కరోనా నేపథ్యంలో 2020 క్యాలెండర్‌ సంవత్సరంలో ప్రధానమైన ఏడెనిమిది నగరాల్లో గృహ విక్రయాలు 40 నుంచి 50 శాతం పడిపోయాయి. దీంతో పెద్దఎత్తున ఉపాధి దెబ్బతింది. అయితే, పండగ సీజన్‌ కావడంతో కొంతమేర పుంజుకున్నప్పటికీ ఉపాధి కల్పించే కీలకరంగం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి..
రైల్వేను నిర్మలమ్మ ఇలా పట్టాలెక్కించారు..
బడ్జెట్..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని