Softbank:భారత్‌దే భవిష్యత్తు.. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ విశ్వాసం

ప్రముఖ మదుపరి, సాఫ్ట్‌బ్యాంక్‌ చీఫ్‌ మసయొషి సన్‌ భారత ఆర్థిక భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు....

Published : 03 Dec 2021 16:34 IST

దిల్లీ: ప్రముఖ మదుపరి, సాఫ్ట్‌బ్యాంక్‌ చీఫ్‌ మసయొషి సన్‌ భారత ఆర్థిక భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌కు మెరుగైన భవిష్యత్తు ఉందని.. ఇక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బాగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత్‌లో మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. భారత్‌లో పుట్టుకొచ్చిన దాదాపు అన్ని యూనికార్న్‌లకు కనీసం 10శాతం నిధులు సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూపే సమకూర్చినట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఉన్న యువ ఆవిష్కర్తలంతా ముందుకు రావాలని పిలపునిచ్చారు. అందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. పేటీఎం, ఓలా, డెలివరీ, ఫ్లిప్‌కార్ట్‌, మీషో సహా పలు ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు పెట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని