Venkatesh: ఈవీ రంగంలో సినీ నటుడు వెంకటేశ్‌ పెట్టుబడులు

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం అందించే బైక్‌వో కంపెనీలో పెట్టుబడులతో సినీ నటుడు వెంకటేశ్‌ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.

Published : 10 Jan 2022 20:40 IST

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం అందించే బైక్‌వో కంపెనీలో పెట్టుబడులతో సినీ నటుడు వెంకటేశ్‌ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. కంపెనీలో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టడంతో పాటు కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వెంకటేశ్‌ వ్యవహరించనున్నారని బైక్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 20వేల ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను నెలకొల్పాలన్న తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఎంతమేర పెట్టుబడులు పెట్టారనేది కంపెనీ వెల్లడించలేదు.

బైక్‌వోతో వెంకటేశ్‌ భాగస్వామ్యం కుదుర్చుకోవడం పట్ల సంస్థ సహ వ్యవస్థపాకుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు, బ్యాటరీ స్వాపింగ్‌ మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, బైక్‌వో నెట్‌వర్క్‌లో డీలర్‌షిప్‌ తీసుకుని వ్యవస్థాపకులుగా మారే అవకాశం కూడా తాము కల్పిస్తున్నట్లు చెప్పారు. బైక్‌వోలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉందని వెంకటేశ్‌ తెలిపారు. బైక్‌వో ఫ్రాంఛైజీ నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా చేరడం ద్వారా ముఖ్యంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారొచ్చని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని