GDP: రెండో దశ ఉన్నా.. వృద్ధి రేటు పైకే!

రెండో దశ కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించినప్పటికీ.. 2022లో భారత వృద్ధి రేటు అంచనాలను జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా పెంచింది. దేశ జీడీపీ 0.7 శాతం పెరిగి 7.7 శాతానికి చేరుకోనున్నట్లు లెక్కగట్టింది....

Published : 11 Jun 2021 22:20 IST

జపాన్‌ ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో దశ కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించినప్పటికీ.. 2022లో భారత వృద్ధి రేటు అంచనాలను జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా పెంచింది. దేశ జీడీపీ 0.7 శాతం పెరిగి 7.7 శాతానికి చేరుకోనున్నట్లు లెక్కగట్టింది. మరోవైపు రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ప్రస్తుతం ఖాతా లోటు పెరగనున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం ఖాతా లోటు 2021లో జీడీపీలో 1.5 శాతానికి, 2022లో 1.3 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం 2021లో 5 శాతానికి, 2022లో 5.3 శాతానికి చేరుకోనున్నట్లు పేర్కొంది. రెపో రేటు 2022 మూడో త్రైమాసికం నాటికి 25 బేసిస్‌ పాయింట్లు పెరగొచ్చని అంచనా వేసింది. 

మే నెలలో వినియోగ, సేవల రంగాలు  దెబ్బతిన్నాయని.. తయారీ, ఎగుమతుల రంగాలు పటిష్ఠంగా నిలిచాయని నొమురా తెలిపింది. మొత్తంగా చూస్తే తొలి దశ కరోనాతో పోలిస్తే రెండో దశలో ప్రభావం తక్కువగానే ఉన్నట్లు పేర్కొంది. అయితే, థర్డ్‌ వేవ్‌, వ్యాక్సినేషన్‌ మందగమనం, మూలధన పెట్టుబడుల తరలింపు, వినియోగ వస్తువుల అధిక ధరలు వంటి అంశాలు సవాల్‌గా నిలవనున్నాయంది. జూన్‌ నుంచి వృద్ధి క్రమంగా పుంజుకుంటుదని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని