సూచీలకు ఒడుదొడుకులు

మూడు రోజుల వరుస లాభాలకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ నష్టపోగా.. నిఫ్టీ సానుకూలంగా ముగిసింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు

Published : 14 Jan 2021 01:46 IST

సమీక్ష

మూడు రోజుల వరుస లాభాలకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ నష్టపోగా.. నిఫ్టీ సానుకూలంగా ముగిసింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణ ప్రభావం చూపింది. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి 73.15 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ నష్టపోగా, సియోల్‌, టోక్యో రాణించాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 49,763.93 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమై, ఇంట్రాడేలో 49,795.19 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. తదుపరి అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకానొకదశలో 49,073.85 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివర్లో పుంజుకుని 24.79 పాయింట్ల నష్టంతో 49,492.32 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 1.40 పాయింట్లు పెరిగి 14,564.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,435.70- 14,653.35 పాయింట్ల మధ్య కదలాడింది.

* డిసెంబరు త్రైమాసికంలో లాభం 39.5 శాతం పెరగడంతో టాటా ఎలెక్సీ షేర్లు దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో 16.70% పరుగులు తీసిన షేరు.. రూ.2424 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. చివరకు 14.41% లాభంతో రూ.2376.40 వద్ద ముగిసింది.
* డాట్‌ నుంచి ఎఫ్‌డీఐ అనుమతులు రావడంతో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 2.21% రాణించి రూ.578.25 దగ్గర స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని