మార్కెట్లోకి హోండా సీబీ350ఆర్‌ఎస్‌

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా భారత మార్కెట్లో సరికొత్త బైకును ప్రవేశపెట్టింది. హచ్‌’నెస్‌ సీబీ 350 ఆర్‌ఎస్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బైకు ధర(దిల్లీ ఎక్స్‌షోరూం)లో రూ.1.96లక్షలుగా నిర్ణయించారు. దీనిలో ఆర్‌ఎస్‌ అంటే ‘రోడ్‌ సెయిలింగ్‌’.

Published : 16 Feb 2021 22:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా భారత మార్కెట్లో సరికొత్త బైకును ప్రవేశపెట్టింది. హచ్‌’నెస్‌ సీబీ 350 ఆర్‌ఎస్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బైకు ధర(దిల్లీ ఎక్స్‌షోరూం)లో రూ.1.96లక్షలుగా నిర్ణయించారు. దీనిలో ఆర్‌ఎస్‌ అంటే ‘రోడ్‌ సెయిలింగ్‌’. వచ్చే నెల మొదటి వారంలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. నేటి నుంచి బైకు కోసం బుకింగ్స్‌ స్వీకరణ మొదలుపెట్టారు.

ఈ సరికొత్త సీబీ 350 ఆర్‌ఎస్‌ బైకు ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఆకర్షణీయమైన రెండు రంగులతో వస్తుంది. వృత్తాకారంలోని ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ అదనపు ఆకర్షణగా నిలిచింది. సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా ఈ బైకును తీర్చిదిద్దారు. టక్‌ అండ్‌ రోల్‌ మోడల్‌ సీటు, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌, డిజిటల్‌ ఇనుస్ట్రుమెంట్‌ కన్సోల్‌, డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, హోండా సెలక్ట్‌బుల్‌ టార్క్ కంట్రోల్‌ వంటివి అమర్చారు.

దీనిలో అమర్చిన సింగిల్‌ సిలిండర్‌ 348 సీసీ ఇంజిన్‌ 5,500 ఆర్‌పీఎం వద్ద 20.8 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 3,000 ఆర్‌పీఎం వద్ద అత్యధికంగా 30ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఈ మోటార్‌ సైకిల్‌ రాయల్‌ ఎన్ఫీల్డ్‌ మెటియోర్‌ 350,క్లాసిక్‌ 350, జావా ఫార్టీటూ వంటి వాటికి పోటీగా హోండా మార్కెట్లోకి తెచ్చింది. 

ఇదీ చదవండి

శాట్‌లో ఫ్యూచర్‌ ‌గ్రూప్‌నకు ఊరట
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని