DHFL acquisition: పూర్తిగా పిరామల్‌ పరమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

దివాలా సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఇక పూర్తిగా పిరామల్‌ గ్రూప్‌ పరమైంది.....

Published : 29 Sep 2021 23:00 IST

దిల్లీ: దివాలా సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఇక పూర్తిగా పిరామల్‌ గ్రూప్‌ పరమైంది. రుణదాతలకు రూ.34,250 కోట్లు చెల్లించడం ద్వారా పరిష్కార ప్రణాళిక ప్రకారం స్వాధీన ప్రక్రియ పూర్తయిందని పిరామల్‌ గ్రూప్ ప్రకటించింది. దీంతో దివాలా స్మృతి చట్టం కింద పరిష్కారమైన తొలి సంస్థ ఇదేనని పేర్కొంది. పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌), డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను విలీనం చేస్తామని తెలిపింది. తర్వాత ఏర్పడే సంస్థను పీసీహెచ్ఎఫ్‌ఎల్‌గానే వ్యవహరిస్తామని పేర్కొంది.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవడంతో 2019 నవంబరులో ఆర్‌బీఐ దివాలా పరిష్కార చర్యలకు ఆదేశించింది. దివాలా చట్టంలోని సెక్షన్‌ 227 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకుని ఆర్‌బీఐ దివాలా పరిష్కార చర్యలకు ఆదేశించిన తొలి ఫైనాన్స్‌ కంపెనీ ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని