ఎస్‌బీఐ డిజిటల్ సేవింగ్స్ ఖాతా ప్ర‌యోజ‌నాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గ‌తేడాది యోనో (యు నీడ్ ఒన్లీ వ‌న్‌) యాప్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీని ద్వారా మొబైల్ నుంచే సుల‌భంగా లావాదేవీల‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. ఈ యాప్ ద్వారా ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను ప్రారంభించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. వినియోగ‌దారులు త‌మ‌ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్‌ను..

Updated : 02 Jan 2021 14:50 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గ‌తేడాది యోనో (యు నీడ్ ఒన్లీ వ‌న్‌) యాప్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీని ద్వారా మొబైల్ నుంచే సుల‌భంగా లావాదేవీల‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. ఈ యాప్ ద్వారా ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను ప్రారంభించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. వినియోగ‌దారులు త‌మ‌ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ డిజిట‌ల్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల భార‌త పౌరులు ఎవ‌రైనా ఎస్‌బీఐ డిజిట‌ల్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. దీనికోసం ఆధార్‌, పాన్ త‌ప్ప‌నిస‌రి. త‌ర్వాత మొబైల్ నంబ‌ర్‌, స్మార్ట్ ఫోన్, ఇ-మెయిల్ అవ‌స‌రం అవుతాయి. ఒక‌రు ఒక ఖాతాను మాత్ర‌మే క‌లిగి ఉండే అవ‌కాశ‌ముంది. ఎస్‌బీఐ వినియోగ‌దారులు ఎస్‌బీఐ యోనో యాప్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఎస్‌బీఐ డిజిట‌ల్ పొదుపు ఖాతా గురించి మ‌రిన్ని వివ‌రాలు…

  • ఎస్‌బీఐ యోన్ ఖాతాను ఉమ్మ‌డిగా ప్రారంభించే అవ‌కాశం లేదు. ఒక‌రు మాత్రమే ఖాతాను ప్రారంభిచాలి.
    ఒక‌రు కేవ‌లం ఒక ఖాతానే క‌లిగి ఉండాలి
  • సాధార‌ణ పొదుపు ఖాతాలో ఉన్న‌ట్లుగానే క‌నీస నిల్వ ప‌రిమితులు ఇందులో ఉంటాయి.
  • రూ.25 వేలు అంత‌కంటే ఎక్కువ‌గా ఉండే డిజిటల్ సేవింగ్స్ ఖాతాపై స‌ర్వీస్ ఛార్జీల మీద 25 శాతం త‌గ్గింపు ఉంటుంది.
  • ఖాతాను ఉమ్మ‌డిగా మార్చుకోవాల‌నుకుంటే బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించి డిజిట‌ల్ నుంచి సాధార‌ణ ఖాతాకు మార్పు చేసుకున్న త‌ర్వాత ఉమ్మ‌డి ఖాతాను నిర్వ‌హించుకోవ‌చ్చు.
  • డిజిట‌ల్ సేవింగ్స్ ఖాతా ప్రారంభించిన‌ప్ప‌డు చెక్ బుక్కులు ఇవ్వ‌రు. అయితే అవ‌స‌ర‌మైన‌ప్పుడు చెక్ బుక్ కోసం దాఖ‌లు చేసుకునే అవ‌కాశ‌ముంది. దీనికి ఒక చెక్ కోసం రూ.10 ఛార్జీ వ‌సూలు చేస్తుంది. 10 చెక్కుల వ‌ర‌కే ప‌రిమితి ఉంది.
  • ఎస్‌బీఐ ఎన్‌ట‌చ్‌లో ఖాతా యాక్టివేట్ చేసుకుంటే మీ ఫోటోతో కూడిన స్పెష‌ల్ ప్లాటినం డెబిట్ కార్డ్, ఎలాంటి ఛార్జీలు లేకుండా పొంద‌వ‌చ్చు.
  • ఈ డిజిట‌ల్ ఖాతాపై పాస్‌బుక్ అందించ‌రు. వినియోగ‌దారులకు ఇ-మెయిల్ ద్వారా ఆడియో లేదా విజువ‌ల్ స్టేట్మెమెంట్ అందిస్తారు.
  • యోనో యాప్‌లోనెల‌వారిగా మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్ పొంద‌వ‌చ్చు.
  • ఈ యాప్‌ను ఫోన్‌లో లేదా కంప్యూట‌ర్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఐఫోన్ ఐఓఎస్ 6 అంత‌కంటే ఎక్కువ‌, ఆండ్రాయిడ్ 4.2 వ‌ర్ష‌న్ నుంచి ఇది అందుబాటులో ఉంది.
  • వినియోగ‌దారుడు ఎంచుకున్న బ్రాంచ్‌ను హోమ్ బ్రాంచ్‌గా ప‌రిగ‌ణిస్తారు.
  • యోనో ఎస్‌బీఐ యాప్‌లో నామినేష‌న్ స‌దుపాయం కూడా ఉంది. ఇది త‌ప్ప‌నిస‌రి కూడా.
  • ఖాతాను మూసివేయాల‌నుకుంటే హోమ్‌బ్రాంచ్‌ని సంప్ర‌దించే ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాలి.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్‌, రిక‌రింగ్ డిపాజిట్ వంటి ఖాతాలు కూడా ఇందులో ప్రారంభించ‌వ‌చ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని