ఇంటి అద్దె ఆదాయంపై.. ప్రామాణిక త‌గ్గింపు ఎంత‌?

మొత్తం అద్దె ఆదాయం నుంచి మున్సిప‌న్నులు తీసివేయ‌గా, మిగిలిన ఆదాయంపై 30 శాతం ప్రామాణిక త‌గ్గింపును పొంద‌వ‌చ్చు.

Updated : 03 Jun 2021 16:06 IST

ఇంటి య‌జ‌మానుల‌కు వ‌చ్చే అద్దె ఆదాయంపై కొంత వ‌ర‌కు మిన‌హాయింపును ఇస్తుంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. అందువ‌ల్ల ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌)ను దాఖ‌లు చేసేప్పుడు ఆదాయ‌పు ప‌న్ను కాలిక్యులేట‌ర్ స‌రిగ్గా ఉప‌యోగించాలి. స్థూల అద్దె ఆదాయంపై, ఇంటి య‌జ‌మానికి 30 శాతం ప్రామాణిక త‌గ్గింపును పొందేందుకు అర్హ‌త ఉంటుంది. ఈ స్థూల అద్దె ఆదాయాన్ని లెక్కించేందుకు.. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చే మొత్తం అద్దె ఆదాయం నుంచి ఆ ఆర్థిక సంవ‌త్స‌రానికి చెల్లించిన మున్సిప‌ల్ ప‌న్నుల‌ను తీసివేయాల్సి ఉంటుంది.

అద్దె ఆదాయంపై వ‌ర్తించే ఆదాయ‌పు ప‌న్ను లెక్కింపు విధానం గురించి  ప‌న్ను,పెట్టుబ‌డుల నిపుణులు బ‌ల్వంత జైన్ మాట్లాడుతూ, ఆదాయపు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం, మొత్తం వార్షిక అద్దెను.. ఆస్తి య‌జ‌మాని అద్దె ఆదాయంగా ప‌రిగ‌ణించ‌రు.  చ‌ట్ట ప్ర‌కారం అద్దెకు ఇచ్చిన ఆస్తికి సంబంధించి మున్సిప‌ల్ ప‌న్నుల‌ను అద్దె నుంచి తీసివేసిన త‌రువాత మిగిలిన మొత్తాన్ని మాత్ర‌మే అద్దె ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. అని తెలిపారు. 

ఈ స్థూల అద్దె ఆదాయంపై 30 శాతం ప్రామాణిక త‌గ్గింపును అనుమ‌తిస్తుంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. ఈ ప్రామాణిక త‌గ్గింపును ఆస్తి మ‌ర‌మ్మ‌త్తులు, నిర్వ‌హ‌ణ కోసం య‌జ‌మాని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

ప్రామాణిక త‌గ్గింపును క్లెయిమ్ చేసుకునేందుకు, ఇంటిని రెన్యూవ‌ల్ చేస్తున్న‌ట్లు, నిర్వ‌హ‌ణ కోసం గానీ  అయిన ఖ‌ర్చుకు సంబంధించి ఓచ‌ర్‌ను చూపించాలి.  ఇంటి మ‌ర‌మ్మ‌త్తులు, పున‌ర్మిర్మాణం వంటి వాటి కోసం బ్యాంక్ నుంచి గానీ ఇత‌ర వ్య‌క్తుల నుంచి రుణం తీసుకున్న‌ట్ల‌యితే రుణం తిరిగి చెల్లింపుల‌పై స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ కింద మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే  స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ కింద అద్దె ఆదాయంలో 30 శాతానికి మించి క్లెయిమ్ చేయ‌కూడ‌దు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని