త్వరలో ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘స్టార్‌ లింక్‌’ ఇంటర్నెట్‌ సేవలు వచ్చే ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని...

Published : 30 Jun 2021 23:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘స్టార్‌ లింక్‌’ ఇంటర్నెట్‌ సేవలు వచ్చే ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్ సదస్సులో ప్రకటించారు. ఇప్పటి వరకు కేబుళ్లు, టవర్ల ద్వారా అందిస్తున్న సంప్రదాయ ఇంటర్నెట్‌ సేవలతో పోలిస్తే స్టార్‌ లింక్‌ పూర్తిగా భిన్నం. ఇక్కడ పూర్తిగా ఉపగ్రహాల ద్వారానే ప్రపంచంలోని ప్రతిమూలకూ ఇంటర్నెట్‌ను అందిస్తారు.

ఇందుకోసం భారీ ఎత్తున చిన్నస్థాయి ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలో (ఎర్త్‌ ఆర్బిట్‌)లోకి ప్రవేశ  పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ టెక్నాలజీస్ కార్పొరేషన్‌’ ఇప్పటి వరకు 1,500 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌ భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. పోటీని తట్టుకొని నిలిచేలా స్టార్‌లింక్‌ను నిలపాలంటే దీర్ఘకాలంలో 20-30 బిలియన్‌ డాలర్ల నిధులు అవసరముంటుందని మస్క్‌ తెలిపారు. ప్రస్తుతం స్టార్‌ లింక్ సేవలు దాదాపు 12 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 69 వేల మంది క్రియాశీల వినియోగదార్లు ఉన్నారు. ఈ సంఖ్య రానున్న ఏడాది కాలంలో దాదాపు ఐదు లక్షలకు చేరే అవకాశం ఉందని మస్క్‌ తెలిపారు.

భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టుపై మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్‌ లింక్‌ విషయంలో తమ మొట్టమొదటి లక్ష్యం.. ఆర్థికంగా దివాలా తీయకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ రంగంలో పోటీగా ఉన్న ‘వన్‌ వెబ్‌’ దివాలా తీసి తిరిగి కోలుకుంటున్న నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని