Swiggy: స్విగ్గీ నుంచి వ‌న్ మెంబ‌ర్‌షిప్ ప్లాన్‌

రూ. 99 కంటే ఎక్కువ ఉన్న అన్ని ఆర్డర్లపై అపరిమిత ఉచిత ఇన్‌స్టామార్ట్ డెలివరీలను అందిస్తుంది.

Published : 23 Nov 2021 14:39 IST

ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ సంస్థ `స్విగ్గీ`.. `స్విగ్గీ వన్`పేరుతో అప్‌గ్రేడెడ్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్ తీసుకొచ్చింది. `స్విగ్గీ వన్` ప్లాన్‌ను ఎంచుకున్న వారికి అపరిమిత ఉచిత డెలివరీలు, ఆహార ధర తగ్గింపులతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ స్విగ్గీ వన్ సేవలను లక్నో, పూణే, తిరువనంతపురం, విజయవాడ.. ఈ 4 నగరాల్లో ముందుగా అందిస్తుంది. రాబోయే 2 వారాల్లో 500 కంటే ఎక్కువ నగరాలకు ఈ `స్విగ్గీ వన్` సేవలను విస్తరించాలని యోచిస్తోంది.

`స్విగ్గీ వన్`తో తమ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా మీట్ స్టోర్ల నుంచి పికప్, డ్రాపింగ్ సేవలను కూడా అందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో స్విగ్గీ.. దాని `స్విగ్గీ సూపర్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌` సేవను పునరుద్దరించింది. విలువ.. అందించే ప్రయోజనాల ఆధారంగా ఈ సేవను `Binge, Bite, Bit` అని 3 వేర్వేరు ప్లాన్లుగా విభజించింది. ఇపుడు కొత్త స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ప్లాన్ ప్రారంభించడంతో, స్విగ్గీ సూపర్ సభ్యత్వం ఇప్పటికే తీసుకున్న వారు మిగిలిన కాలానికి స్విగ్గీ వన్ ప్రోగ్రామ్ కి ఆటోమేటిక్ గా అప్‌గ్రేడ్‌ అవుతారని సంస్థ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుత ప్లాన్ పై నెల రోజులు కాంప్లిమెంటరీ పొడిగింపును కూడా పొందుతారు.

స్విగ్గీ తమ వినియోగదారులకు ఆహార డెలివరీతో పాటు కిరాణా సరుకులను వేగంగా అందించడం లాంటి ఇతర సేవలను అందిస్తోంది.  కొత్తగా ప్రారంభించిన `స్విగ్గీ వన్` కార్యక్రమం ద్వారా కస్టమర్లకు ఆర్ధికంగా లబ్ధి  చేకూరుస్తూ తగ్గింపు రేట్లతో పాటు, ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. `స్విగ్గీ వన్` అనేది సింగిల్-టైర్ మెంబర్షిప్ ప్రోగ్రామ్. ఇది రూ. 99 కంటే ఎక్కువ ఉన్న అన్ని ఆర్డర్లపై అపరిమిత ఉచిత ఇన్‌స్టామార్ట్ డెలివరీలతో పాటు 70 వేల కంటే ఎక్కువ రెస్టారెంట్ల నుంచి అపరిమిత ఆహార డెలివరీలను ఉచితంగా అందిస్తుందని సంస్థ తెలిపింది. స్విగ్గీ తన విస్తరణలో భాగంగా గత సంవత్సరం ఇన్‌స్టెంట్‌ గ్రోసరీ (కిరాణా సరుకులు) డెలివరీ సర్వీస్ ఇన్‌స్టామార్ట్ ను ప్రారంభించింది. ప్రస్తుతం `స్విగ్గీ వన్' సభ్యత్వం 3 నెలలకు రూ. 299, 12 నెలలకు రూ. 899 కి లభిస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని