ఇ-కామర్స్ సంస్థ‌లకు టీడీఎస్ నిబంధ‌న‌లు

ఇ-కామర్స్‌ ఆపరేటర్లు అందించే వస్తువుల, సేవల విక్రయాలపై 1 శాతం ఆదాయ పన్ను మినహాయిస్తారు  

Published : 18 Dec 2020 13:27 IST

మూలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్‌) నిబంధనల అమలు విషయంలో ఆదాయ పన్ను(ఐటీ) విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

ఇ-కామ‌ర్స్ సంస్థ‌లు:
కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం… ఇ-కామర్స్‌ ఆపరేటర్లు అందించే వస్తువుల, సేవల విక్రయాలపై 1 శాతం ఆదాయ పన్ను మినహాయిస్తారు. ఆ మేరకు ఆదాయ పన్ను చట్టం 1961లో కొత్త సెక్షన్‌ '194-'ను ఫైనాన్స్‌ యాక్ట్‌ 2020 తీసుకొచ్చింది. అదే సమయంలో సెక్షన్‌ 206సిలో సబ్‌ సెక్షన్‌ (1హెచ్‌)ను కూడా చొప్పించింది. దీని ప్రకారం… ఏదైనా అంతక్రితం ఏడాదిలో మొత్తం విక్రయాలు రూ.50 లక్షలు మించినపుడు కొనుగోలుదారు నుంచి విక్రేత 0.1 శాతం పన్ను వసూలు చేయాలి. ఇది కూడా అక్టోబరు 1 నుంచే అమల్లోకి వస్తుంది.

బీమా సంస్థ‌లు:
ఇన్సూరెన్స్ కంపెనీకి, పాలసీ కొనుగోలుదారుకు మధ్య లావాదేవీలలో ప్రమేయం లేకపోతే, ఆ తరువాతి సంవత్సరాలకు చట్టం యొక్క సెక్షన్ 194-0 ప్రకారం పన్నును మిన‌హాయించే బాధ్యత అతనికి ఉండదు" అని సిబిడిటి ప్ర‌క‌టించింది. ఏదేమైనా, భీమా సంస్థ బీమా ఏజెంట్ లేదా అగ్రిగేట‌ర్‌కు కమీషన్ చెల్లింపుపై పన్నును మినహాయించవలసి ఉంటుంది.

కాగా, కొత్తగా తీసుకొచ్చిన టీసీఎస్‌ నిబంధనలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా జరిగే సెక్యూరిటీస్‌, కమొడిటీస్‌ లావాదేవీలకు వర్తించవని సీబీడీటీ స్పష్టం చేసింది. పవర్‌ ఎక్స్ఛేంజీల ద్వారా జరిగే లావాదేవీలపైనా వర్తించవని తెలిపింది. అయితే ఇంకా పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని మార్కెట్‌ వర్గాలు, విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని