Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి....

Updated : 24 Dec 2021 09:46 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రిస్మస్‌కి ముందు మార్కెట్లలో శాంటాక్లాజ్‌ ర్యాలీ కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ఒమిక్రాన్‌ భయపెడుతున్నప్పటికీ.. ప్రభుత్వాలు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మదుపర్లలో విశ్వాసం నింపుతున్నాయి.

ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 57,389 వద్ద.. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 17,090 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఏషియన్ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు

* ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌: ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌ను సుమారు రూ.3,192 కోట్లకు (42.5  కోట్ల డాలర్లు) విదేశీ బ్యాంకు హెచ్‌ఎస్‌బీసీ కొనుగోలు చేయనుంది.

* డాక్టర్‌ రెడ్డీస్‌: మెర్క్‌ తయారు చేసిన కొవిడ్‌-19 మాత్రకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ఈ మాత్రను తయారు చేయడానికి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌కి లైసెన్స్‌ ఉండడం విశేషం. 

* అజంతా ఫార్మా: డిసెంబరు 28న బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం కానున్నారు. రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌పై చర్చించనున్నారు.

* ఇండియన్‌ ఆయిల్‌: మధుర నుంచి కొత్త ముడి చమురు పైప్‌లైన్‌ నిర్మాణం నిమిత్తం రూ.9,028 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

* టెగా ఇండస్ట్రీస్‌: చిలీ దేశంలో భారీ అదనపు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చించనున్నారు.

* ఎంఫసిస్‌: ఇంగ్లాండ్‌, వేల్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఎంరాల్డ్‌ లిమిటెడ్‌లో 51 శాతం వాటా ఎంఫసిస్‌ సొంతం కానుంది. అనంతరం అర్డోనాగ్‌తో కలిసి బిజినెస్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని