Stock market: సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల దన్ను

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 28 Dec 2021 09:39 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఒమిక్రాన్‌ వల్ల హాస్పిటలైజేషన్‌ పెరగకపోవచ్చుననే అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లలో విశ్వాసం నింపాయి. మరోవైపు క్రిస్మస్‌, కొత్త సంవత్సరం నేపథ్యంలో మార్కెట్లలో కొంత ర్యాలీ కనబడుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 335 పాయింట్ల లాభంతో 57,755 వద్ద.. నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 17,182 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.94 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క డాక్టర్‌ రెడ్డీస్‌ మినహా దాదాపు అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, విప్రో, పవర్‌గ్రిడ్‌, ఎస్బీఐ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు

* సీమెన్స్ ఇండియా: పుణెలోని హింజెవాడీ నుంచి శివాజీనగర్‌ వరకు మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం టాటా సంస్థ అయిన టీఆర్‌ఐఎల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది.

* ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌‌: ఆర్‌బీఎల్‌ బ్యాంకులో పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నాయని ఆరోపణలు, ఖాతాదారులకు ఆర్‌బీఐ హామీ నేపథ్యంలో నేడు ఈ స్టాక్ ఎలా చలిస్తుందో చూడాల్సి ఉంది. అలాగే బజాజ్‌ ఫైనాన్స్‌తో కో-బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డు కోసం ఆర్‌బీఎల్‌ భాగస్వామ్యం కుదుర్చుకొంది.

* గ్రేట్‌ ఈస్టర్న్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్‌‌: రూ.225 కోట్లతో షేర్ల బైబ్యాక్‌. ఒక్కో షేరుకు రూ.333 చెల్లింపునకు ఆమోదం.

* న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్‌ : ఒక్కో షేరుకు రూ.700 వద్ద 22,67,400 షేర్ల బైబ్యాక్‌.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని