Stock market: దేశీయ సూచీల్లో కొనసాగుతున్న లాభాల జోరు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి...

Updated : 08 Dec 2021 09:28 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో నడుస్తున్నాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండొచ్చన్న వార్తలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.75.37 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి.

ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 642 పాయింట్ల లాభంతో 58,275 వద్ద.. నిఫ్టీ 192 పాయింట్ల లాభంతో 17,369 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క టైటన్‌(0.03%) మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని