TikTok: మూడో అతిపెద్ద సోషల్‌ మీడియాగా టిక్‌టాక్‌..?

చైనాకు చెందిన సోషల్‌ మీడియా దిగ్గజం టిక్‌టాక్‌ మరో ఘనతకు చేరువవుతోంది. 2022లో ప్రపంచలో అత్యధికంగా వినియోగించే మూడో అతిపెద్ద సోషల్‌ మీడియా సంస్థగా ఎదగనుందని

Published : 21 Dec 2021 20:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన సోషల్‌ మీడియా దిగ్గజం టిక్‌టాక్‌ మరో ఘనతకు చేరువవుతోంది. 2022లో ప్రపంచలో అత్యధికంగా వినియోగించే మూడో అతిపెద్ద సోషల్‌ మీడియా సంస్థగా ఎదగనుందని ‘ఇన్‌సైడర్‌ ఇంటెలిజెన్స్‌’( గతంలో ఈమార్కెటర్‌ )అనే సంస్థ పేర్కొంది.  2022 నాటికి ప్రతినెలా దీనిని 75 కోట్ల మంది వినియోగిస్తారని అంచనా వేసింది. 2020లో టిక్‌టాక్‌ వినియోగదారుల సంఖ్య 59.8శాతం వృద్ధి చెందగా.. 2021లో ఈ పెరుగుదల 40.8శాతంగా ఉంది. 

‘‘టిక్‌టాక్‌ నుంచి ప్రధాన పోటీ స్నాప్‌ఛాట్‌కు ఉంది. ఈ రెండు యువతను ఆకర్షించడంలో పోటీ పడుతున్నాయి’’ ఇన్‌సైడర్‌ ఇంటెలిజెన్స్‌ విశ్లేషకురాలు డెబ్రా ఓహ్ పేర్కొన్నారు. టిక్‌టాక్‌కు ట్విటర్‌కు ఎటువంటి పోలికలు లేవని తెలిపారు. టిక్‌టాక్‌ కంటెంట్‌ వ్యసనంగా మారే అవకాశం ఉందని  పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌కు ప్రతినెలా 291 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఏటా వీరి సంఖ్య 6శాతం పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని