ప్ర‌పోజ‌ల్ ఫారం అంటే ఏంటి ?

బీమా కంపెనీ మీ గురించి అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని తెలుసుకునేందుకు ప్ర‌పోజ‌ల్ ఫారం ఉప‌యోగ‌ప‌డుతుంది.

Published : 22 Dec 2020 20:20 IST

బీమా పాల‌సీని తీసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నాక మొద‌టి చేయ‌వ‌ల‌సింది ప్ర‌పోజ‌ల్ ఫారంను (ప్ర‌తిపాద‌న ప‌త్రం) పూరించ‌డం. ప్ర‌పోజ‌ల్ ఫారం అంటే బీమా కంపెనీ మీ గురించి అవ‌స‌ర‌మైన‌ స‌మాచారాన్ని తెల‌సుకునేందుకు తోడ్ప‌డే లీగ‌ల్ డాక్యుమెంట్‌గా చెప్పుకోవ‌చ్చు. ఇందులో పేరు, వ‌య‌సు, జెండ‌ర్‌, చిరునామా వంటివి తెల‌పాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆ పాల‌సీ తీసుకునేందుకు అర్హ‌త స‌రిపోతుందో లేదో తెలుస్తుంది. జీవిత బీమా అయితే ప్ర‌పోజ‌ల్ ఫారంలో వ‌య‌సు, ఆదాయం, వృత్తి వంటివి తెలియ‌జేయాలి. ప్రీమియం అంచ‌నా వేసేందుకు వ‌య‌సు, పాల‌సీ ఎంత మొత్తానికి కొనుగోలు చేయ‌వ‌చ్చో ఆదాయాన్ని బ‌ట్టి తెలుస్తుంది. అదేవిధంగా నామినీ వివ‌రాలు కూడా ఇవ్వాలి. దీంతో పాటు ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు మెడిక‌ల్ హిస్ట‌రీని కూడా చేర్చాల్సి ఉంటుంది. ఏదైనా వ్యాదులు ఉంటే సంస్థ‌కు రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. మీరు ఎంచుకున్న పాల‌సీ ఆధారంగా ఆరోగ్య ప‌రిక్ష‌లు చేసుకోవాల్సి రావ‌చ్చు. ఇత‌ర పాల‌సీల వివ‌రాలు కూడా ప్ర‌పోజ‌ల్ ఫారం అడుగుతుంది. అంటే పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రంగా తెలుసుకునేందుకు ప్ర‌పోజ‌ల్ ఫారం తోడ్ప‌డుతుంది. అందుకే స్వ‌యంగా ప్ర‌పోజ‌ల్ ఫారంను పూరిస్తే పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని