సుక‌న్య స‌మృద్ధి యోజ‌నతో ఆడ‌పిల్ల భ‌విష్య‌త్తుకు భ‌రోసా - పార్ట్ 2

18 ఏళ్లు నిండిన త‌ర్వాత మాత్ర‌మే ఒక్క‌సారి విద్య లేదా వివాహ అవ‌స‌రాల నిమిత్తం 50 శాతం మేర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు...

Published : 21 Dec 2020 16:16 IST

18 ఏళ్లు నిండిన త‌ర్వాత మాత్ర‌మే ఒక్క‌సారి విద్య లేదా వివాహ అవ‌స‌రాల నిమిత్తం 50 శాతం మేర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు​​​​​​​

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా గురించి స‌మ‌గ్ర వివరాలు క‌థ‌నంలో ఈ ప‌థ‌కానికి అర్హ‌త‌, గ‌డువు, ఎంత పొదుపు చేస్తే ఎంత కాలానికి ఎంత వ‌డ్డీ ల‌భిస్తుందన్న విష‌యాల‌ను తెలుసుకున్నాం. ఇప్ప‌డు ఈ ఖాతా గురించి మ‌రిన్ని పూర్తి వివ‌రాల‌ను ఇక్క‌డ తెలుసుకోండి
పాక్షిక / పూర్తి ఉప‌సంహ‌ర‌ణ‌:

  • బాలిక‌కు 18 ఏళ్లు నిండిన త‌ర్వాత మాత్ర‌మే ఒక్క‌సారి విద్య లేదా వివాహ అవ‌స‌రాల నిమిత్తం ఖాతాలోని సొమ్ములో 50శాతం మేర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
  • అయితే దానికోసం సంబంధించిన కాలేజీ ఫీజు ర‌శీదులు వంటివి ఆధార‌లు చూపించాలి.
  • ఖాతా ప్రారంభించి 21 సంవ‌త్స‌రాలు పూర్త‌యితే లేదా అమ్మాయి పెళ్లి కోసం ఏది మొద‌ట జ‌రిగితే దానికోసం పూర్తి డ‌బ్బును తీసుకోవ‌చ్చు.
  • ఖాతా నుంచి డ‌బ్బు తీసుకునేందుకు ఖాతాదారు అంటే ఎవ‌రి పేరు మీద ఖాతా ఉంటుందో వారికి మాత్ర‌మే వీలుంటుంది.

ఖాతా మూసివేత :
21 సంవత్సరాల కాల పరిమితి పూర్తయ్యే ముందే అమ్మాయి వివాహం చేసుకున్నట్లైతే, ఖాతా ఆటోమాటిక్ గా మూతపడిపోతుంది.

విత్‌డ్రా , ముంద‌స్తు ఖాతా ముగింపు:

  • ఏదైనా అనుకోని కార‌ణాల చేత ఖాతాదారు మ‌ర‌ణిస్తే వెంట‌నే మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్ర‌ము స‌మ‌ర్పించి ఖాతాను మూసివేయ‌వ‌చ్చు.
  • అయితే ఖాత ప్రారంభించిన‌ 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత అయితేనే ఇందుకు వీల‌వుతుంది.
    ఖాతా ముంద‌స్తు మూసివేత‌కు క‌నీసం 5 సంవ‌త్స‌రాలు అయ్యుండాలి.
  • అయితే ఏదైనా ప్రాణాంత‌క వ్యాదులు వంటివి వ‌చ్చిన‌ సంద‌ర్భాల్లో మాత్ర‌మే దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.
    ఖాతాదారులకి 18 సంవత్సరాల వయస్సు పూర్తై, ఆమెకు వివాహం జరిగినట్లైయితే, ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది. వివాహానికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
    21 ఏళ్లు వ‌చ్చాక ఖాతాను పూర్తిగా ముగించ‌వ‌చ్చు.

పాస్‌ పుస్త‌కం:

  • ఖాతా ప్రారంభ స‌మ‌యంలోనే పాస్‌పుస్త‌కం అంద‌జేస్తారు.
  • ఇందులో బాలిక‌ పుట్టిన తేదీ, ఖాతా ఆరంభ తేదీ, డిపాజిట్ సొమ్ము, ఖాతాదారు పేరు, చిరునామా మొద‌లైన వివ‌రాలు ఉంటాయి.
  • ఖాతా తెరిచే స‌మయానికి, డిపాజిట్ చేసేట‌ప్పుడు, డ‌బ్బు విత్ డ్రాయ‌ల్‌, ఖాతా ముగించేప్పుడు పాస్‌పుస్త‌కం ఉండాలి.
    మీ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ఖాతా వివ‌రాల‌ను చూసుకోవ‌చ్చు .
  • అదేవిధంగా ఖాత ఉన్న‌ పోస్టాఫీస్ లేదా బ్యాంకు శాఖ‌కు వెళ్లి పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయ‌డం ద్వారా ఖాతాను చెక్ చేసుకోవ‌చ్చు.

ప‌న్ను మిన‌హాయింపు:

  • సుక‌న్య స‌మృద్ధి ఖాతాలో వార్షికంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు చేసిన మదుపు పై, సెక్ష‌న్ 80 సీ కింద పన్ను మినహాలింపు లభిస్తుంది.
  • సుక‌న్య స‌మృద్ధి ఖాతాలో డిపాజిట్ల‌పై వ‌చ్చిన వ‌డ్డీపై ప‌న్ను ఉండ‌దు. దీనిపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
    అంటే పెట్టుబ‌డులు, వ‌డ్డీ, ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో కూడా ఎటువంటి ప‌న్ను ఉండ‌దు.

ఎన్ ఆర్ ఐ లు:
ఎన్ఆర్ఐలకు సుక‌న్య స‌మృద్ధిలో పెట్టుబ‌డుల‌కు వీల్లేదు. అయితే త‌ల్లిదండ్ర‌లు ఎన్ఆర్ఐలు అయిన‌ప్ప‌టికీ వారి అమ్మాయికి భార‌త పౌర‌స‌త్వం ఉంటే ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు.

ఖాతా ఎక్కడ తెరవవచ్చు :
పోస్టాఫీస్ లేదా దేశంలోని 28 అధికారిక‌ బ్యాంకుల శాఖ‌ల్లో ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు.
మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న లేదా మీకు సౌక‌ర్యంగా ఉన్న బ్యాంకు శాఖ‌లో ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు.

అవసరమైన పత్రాలు :
ఖాతా ప్రారంభించేందుకు ఫారం
జ‌న‌న దృవీక‌ర‌ణ ప‌త్ర‌ము
త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌క్షుడి గుర్తింపు ప‌త్రం, చిరునామ.

ఖాతా బదిలీ :

  • దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా పోస్టాఫీస్ నుంచి బ్యాంకుకు సుక‌న్య స‌మృద్ధి ఖాతాను మార్చుకునే అవ‌కాశం ఉంది.
    అలాగే ఏదైనా బ్యాంకు శాఖ నుంచి అయినా పోస్టాఫీసుకు ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు.
  • మీరు సుక‌న్య స‌మృద్ధి ఖాతా నిర్వ‌హిస్తున్న పోస్టాఫీసు లేదా బ్యాంకుకి వెళ్లి ఖాతా బ‌దిలీ కోసం ఫార‌మ్‌ని తీసుకొని అందులో అన్ని వివ‌రాల‌ను పూర్తిచేయాలి. అదేవిధంగా మీరు ఏ బ్యాంకు/పోస్టాఫీసుకి ఖాతా బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో ఆ బ్యాంకు పేరు, చిరునామా వంటివి అందులో తెలియ‌జేయ‌ల‌సి ఉంటుంది.
  • ఖాతా బ‌దిలీ కోసం చేసుకున్న ద‌ర‌ఖాస్తు ప‌త్రంలో అన్ని వివ‌రాలు పూరించిన త‌ర్వాత, ఖాతాకు సంబ‌ధించిన పాస్‌బుక్‌ను తీసుకొని వెళ్లి అక్క‌డ అంద‌జేయాలి.
  • మీ ద‌ర‌ఖాస్తును, ఇత‌ర వివ‌రాల‌ను బ్యాంకు ప‌రిశీలించి ఖాతా మూసివేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తుంది.
    ఖాతాకు సంబంధించిన‌ డిమాండ్ డ్రాఫ్ట్, న‌గ‌దు వంటివి మీ చేతికి అందిస్తారు. వాటిని తీసుకెళ్లి ఎక్క‌డైతే మీరు కొత్త‌గా ఖాతా ప్రారంభించాల‌నుకుంటున్నారో అక్క‌డ ఇవ్వాలి.
  • పాత బ్యాంకు/ పోస్టాఫీసులో ఇచ్చిన ప‌త్రాలు, న‌గ‌దుతోపాటు మీరు ఎక్కడికి ఖాతా బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో ఆ బ్యాంకుకు వెళ్లాలి. అక్క‌డ సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాను ప్రారంభించేందుకు కావ‌ల్సిన ప‌త్రాల‌ను పూర్తి చేయాలి. అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను అందించాలి.
  • ఇక్క‌డ‌ గుర్తుంచుకోవ‌ల‌సిన‌ది ఏంటంటే, మీరు ఎవ‌రి పేరు మీద ఖాతాను ప్రారంభిస్తున్నారో వారిని బ్యాంకు లేదా పోస్టాఫీసుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదు.
    ఆ ఖాతాను సొంతంగా నిర్వ‌హించుకునేత స్థాయి వ‌చ్చే వ‌ర‌కు ఖాతా గురించి వారు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
  • సాధారణంగా బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్లు రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ ను అంగీకరించవు.
    ఒకవేళ ఖాతాలో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడితే, అలాంటి సందర్భాల్లో మాత్రమే రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ ను అంగీకరిస్తారు. కానీ మీరు డిపాజిట్ చేసిన అధిక మొత్తంపై ఎలాంటి వడ్డీని మీరు పొందలేరు. గరిష్ట పరిమితి కంటే ఎక్కువగా చేసిన డిపాజిట్లను ప్రభుత్వం పక్కన పెడుతుంది.
  • తెలియకుండా రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన మొత్తాన్ని పెట్టుబడిదారుడు ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
  • సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూరిటీ అనేది ఖాతాను తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల వరకు లేదా 21 సంవత్సరాల లోపు అమ్మాయికి వివాహం అయినప్పుడని ( ఏది ముందుగా జరిగితే) చాలా మందికి తెలిసిన విషయమే.
    సుకన్య సమృద్ధి యోజన (ఖాతా) ఉత్తమ వడ్డీ రేటును అందిస్తోందని, అలాగే మెచ్యూరిటీ మొత్తానికి ఎలాంటి పన్ను వర్తించదని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.
  • ఏదేమైనా, ఖాతాను తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఎలాంటి వడ్డీని పొందలేరనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి.
  • ఒకవేళ సుకున్య సమృద్ధి యోజన ఖాతా 21 సంవత్సరాల తరువాత కూడా క్రియాశీలంగా ఉన్నట్లయితే, అప్పుడు మీ ఖాతా ఒక్క రూపాయి వడ్డీని కూడా సంపాదించదు. అందువలన, 21 సంవత్సరాలు పూర్తైన వెంటనే ఖాతాను మూసివేయడం ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని