రెండో ఇంటిపై కూడా పన్ను ర‌ద్దు

బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన ప్ర‌కారం రెండు సొంత‌ ఇళ్లు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి స్థిరాస్తి రంగానికి పలు ప్రోత్సాహకాలను ..

Published : 25 Dec 2020 13:37 IST

బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన ప్ర‌కారం రెండు సొంత‌ ఇళ్లు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి స్థిరాస్తి రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇప్పటి వరకూ పన్ను చెల్లింపుదారుడు ఒక ఇంటిని మాత్రమే సొంత నివాసానికి ఎలాంటి ఆదాయం చూపించాల్సిన అవసరం లేకుండా ఎంచుకోవచ్చు. ఇప్పుడు తాజా బ‌డ్జెట్‌లో సెక్షన్‌ 23కి కొత్త బడ్జెట్‌లో సవరణ చేశారు. దీని ప్రకారం ఇకపై రెండు ఇళ్లను సొంతంగా నివాసం ఉంటున్నట్లుగా చూపించుకోవచ్చు. ఇది కొంత ప్రయోజనం చేకూర్చే అంశంగానే చెప్తున్నారు. ఉదాహరణకు మీకు ఉద్యోగం చేసే చోట ఒక ఇల్లు, మీ సొంత ఊరిలో మరో ఇల్లు ఉందనుకోండి. ఈ రెండు ఇళ్లనూ సొంతంగా నివాసం ఉంటున్నట్లు చూపించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప‌న్ను చెల్లింపులు త‌గ్గుతాయి.

రెండిళ్లు ఉన్న వారు, ఒక ఇంట్లో నివసిస్తూ, మరొకదాంట్లో తమ తల్లిదండ్రులు/కుటుంబీకులను ఉంచడమో చేస్తుంటారు. రెండో ఇంటినీ ఇలా సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నా, దానిపై ఆదాయమేమీ పొందకున్నా, దీనిపై అద్దె వస్తున్నట్లే (ఆదాయంగా) పరిగణిస్తూ, పన్ను వసూలు చేస్తున్నారు. ఇందుకు ఆ ప్రాంత మున్సిపాలిటీ/నగర పాలక సంస్థ వంటి స్థానిక ప్రభుత్వాలు నిర్ణయించే అద్దె విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే దీనిపై పన్ను నుంచి మినహాయింపు ఇవ్వ‌నున్న‌ట్లు తాజా బడ్జెట్ లో ప్రతిపాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని