BMW India: జనవరి నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు

BMW India pric hike: Mahindra price hike: భారత్‌లో బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.

Published : 11 Dec 2023 20:31 IST

దిల్లీ: జర్మనీకి చెందిన  కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు రెండు శాతం మేర పెరుగుతాయని ప్రకటనలో పేర్కొంది. విదేశీ మారక ద్రవ్య విలువ పెరగడంతోపాటు, నిర్వహణ వ్యయం అధికం కావడంతో ధరలు పెంచక తప్పడం లేదని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. జనవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. 

భారత్‌లో బీఎండబ్ల్యూ సంస్థ ‘220ఐ ఎమ్‌ స్పోర్ట్‌’ నుంచి ‘ఎక్స్‌ఎమ్‌’ వరకు వివిధ రకాల కార్లను విక్రయిస్తుంది. వీటి ధరల శ్రేణి రూ.43.5 లక్షల నుంచి రూ.2.6 కోట్ల వరకు ఉంది. ప్యాసింజర్‌ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా, హోండా, ఆడీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో బీఎండబ్ల్యూ చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని