ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుల ప‌నితీరు ఎలా ఉంది?

ఎన్‌పీఎస్ ద్వారా ఈక్విటీలు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల‌ లో తగిన నిష్పత్తి లో మదుపుచేయొచ్చు....

Published : 21 Dec 2020 17:08 IST

ఎన్‌పీఎస్ ద్వారా ఈక్విటీలు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల‌ లో తగిన నిష్పత్తి లో మదుపుచేయొచ్చు​​​​​​​.

మనకున్న పరిమితమైన పెన్షన్ పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్ -NPS) ఒకటి. 2004 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మొదలైంది. 2009 నుంచి చాలా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులతోపాటు, భారత దేశ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా మదుపు చేయడం వలన పదవీవిరమణ నిధిని చేకూర్చుకోవచ్చు. ప్రతి సభ్యునకు ఈక్విటీలలో, ప్రభుత్వ బాండ్స్ లో, కార్పొరేట్ బాండ్స్ లో తగిన నిష్పత్తి లో మదుపుచేయొచ్చు. దీర్ఘకాలం ఈక్విటీలలో మదుపు చేయడం వలన కొంత అధిక రాబడిని పొందొచ్చు. ఈక్విటీలు స్వల్పకాలంలో ఒడిదుడుకులకు లోనైనా , దీర్ఘకాలంలో మంచి రాబడి అందిస్తాయి.

ఈ కింది పట్టిక ద్వారా గత ఏడాది, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఈక్విటీలు , ప్రభుత్వ బాండ్స్ లో, కార్పొరేట్ బాండ్స్ లలో రాబడి ఎంత వచ్చిందో చూడవచ్చు.

ఉదా: హెచ్ డిఎఫ్సి పెన్షన్ ఫండ్ :
ఈక్విటీలలో 15.47% (ఏడాది), 11.97% (3 ఏళ్ళు) , 8.48% (5 ఏళ్ళు) రాబడి పొందింది.
ప్రభుత్వ బాండ్స్ లో 15.27% (ఏడాది), 9.41% (3 ఏళ్ళు) , 9.28% (5 ఏళ్ళు) రాబడి పొందింది.
కార్పొరేట్ బాండ్స్ లో 13.56% (ఏడాది), 8.61% (3 ఏళ్ళు) , 9.45% (5 ఏళ్ళు) రాబడి పొందింది.
ఫై విధంగా ఇతర పెన్షన్ ఫండ్ మేనేజర్ ల పనితీరును పరిశీలించవచ్చు.

nps.jpg

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని