విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

స్వ‌దేశంలో ఉండ‌గా ఎఫ్‌డీ చేసి కాల‌ప‌రిమితి ముగిసేస‌రికి విదేశాల్లో స్థిర‌ప‌డితే ఇక్క‌డి ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని విదేశీ ఖాతాకు బ‌దిలీ చేసకోవ‌చ్చు

Published : 15 Dec 2020 19:34 IST

ఎన్ఆర్ఐ ఖాతాల‌కు సంబంధించి మూడు రకాల నాన్-రెసిడెంట్ ఖాతాలు ఉన్నాయి. వాటిలో ఎక్స‌ట‌ర్న‌ల్ నాన్-రెసిడెంట్ (ఎన్ఆర్ఈ), విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్), సాధారణ నాన్-రెసిడెంట్ (ఎన్ఆర్ఓ) ఖాతాలు.

ఎక్స్చేంజ్ నియంత్రణ చట్టం కింద, ఒక వ్యక్తి ఉద్యోగం ,వ్యాపారం , విదేశీయానం లేదా ఇతర కారణాల వలన కొంత కాలం పాటు భారతదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లైతే, ప్రస్తుత రెసిడెంట్ బ్యాంకు ఖాతాను ఎన్ఆర్ఓ ఖాతాగా మార్చుకోవలసి ఉంటుంది. లేదంటే అక్కడే ఒక కొత్త ఎన్ఆర్ఈ ఖాతాను తెరవచ్చు.

ఎక్స్ఛేంజ్ నియంత్రణ చట్టం ప్రకారం, “విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి” గా అర్హత పొందిన వారు, ఎన్ఆర్ఈ ఖాతాల (పొదుపు, స్థిర డిపాజిట్లు) నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై సెక్షన్ 10 (4) (ii) కింద భారతదేశంలో పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ చట్టం ప్రకారం, నివాస హోదాని గుర్తించే నియమాలు ఆదాయ పన్నుచట్టం పరిధిలో ఉండే నియమాలకు భిన్నంగా ఉంటాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదించిన డిపాజిట్లకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతాకు బ్యాంకు చెల్లించడం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం పై (విదేశీ కరెన్సీలో డిపాజిట్లపై) ఆదాయ పన్ను చట్టం, సెక్షన్ 10 (15) (iv) (ఎఫ్ఏ) కింద అర్హత పొందిన నాన్ - రెసిడెంట్ వ్యక్తులు లేదా ఆర్డినరీ రెసిడెంట్ కాని వారికి పన్ను మినహాయింపు ఉంటుంది.

రెసిడెంట్ బ్యాంకు ఖాతా, ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతా నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై వారి స్లాబ్ రేట్ ఆధారంగా పన్ను విధిస్తారు. పొదుపు బ్యాంకు ఖాతా నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మిన‌హాయింపు రూ. 10,000 పొంద‌వ‌చ్చు. (ఆర్థిక సంవత్సరం (2018-19) - 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ పౌరులకు సంవత్సరానికి ఈ ప‌రిమితి రూ. 50,000 చేశారు. అయితే ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతా విషయంలో పన్ను విత్ హోల్డింగ్ ప‌న్నునిబంధనలు వ‌ర్తిస్తాయి.

ఎన్ఆర్ఓ ఖాతాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్ రూపంలో 30 శాతం (ప్లస్ వర్తించే సర్ఛార్జ్, సెస్) పన్ను విధిస్తారు. మ‌న దేశంలో ఒక వ్యక్తి నాన్-రెసిడెంట్ కేట‌గిరీలోకి వ‌స్తే వారికి ల‌భించే వ‌చ్చే వడ్డీ ఆదాయంపై స్లాబ్ రేట్ల ప్రకారం (ప్లస్ వర్తించే సర్ఛార్జ్, సెస్) పన్ను విధిస్తారు. అయితే భారతదేశ ద్వంద పన్ను మినహాయింపు ఒప్పందం ప్రకారం, ఎన్ఆర్ఐ కేటగిరీ కి చెందిన వారు రెండు దేశాల్లో పన్ను చెల్లింపులు చేసే విధానం నుంచి బయటపడవచ్చు. దీనికి వారు పని చేస్తున్న దేశంలో చెల్లించిన పన్ను తాలూకా ధ్రువ పత్రాలను స్వదేశంలో సమర్పించడం ద్వారా పన్ను తగ్గింపు పొందవచ్చు.

స్వ‌దేశంలో ఉండే ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను ఎన్ఆర్ఓ ఖాతాకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.ఎన్ఆర్ఈ ఖాతా నుంచి నిధులను సులభంగా స్వదేశానికి పంపుకొవచ్చు. ఒక ఎన్ఆర్ఓ ఖాతా ద్వారా ఆర్థిక సంవత్సరానికి 1 మిలియన్ డాలర్లు వరకు భారతదేశం వెలుపల చెల్లించటానికి వీలుంటుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని