Fixed Deposits: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన డీసీబీ బ్యాంక్‌

డీసీబీ బ్యాంకు కొన్ని కాలవ్యవధులపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

Published : 13 Dec 2023 17:48 IST

దిల్లీ: డీసీబీ బ్యాంకు కొన్ని (కాలవ్యవధుల) డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల (బీపీఎస్‌) వరకు పెంచింది. 7-45 రోజుల కనీస కాలవ్యవధి డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లు 3.75% కనిష్ఠ వడ్డీని అందుకోనుండగా.. సీనియర్‌ సిటిజన్లు 4.25% వడ్డీను అందుకుంటారు. 12 నెలల 1 రోజు ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లు 7.85% వడ్డీని, ఇదే కాలవ్యవధి డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 8.35% వడ్డీ అందుకుంటారు. 25 నెలల ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లు 8% గరిష్ఠ వడ్డీ అందుకోనుండగా, సీనియర్‌ సిటిజన్లు 8.60% గరిష్ఠ వడ్డీని పొందొచ్చు. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం.. కొత్త రేట్లు 2023 డిసెంబర్‌ 13 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని