సాధారణ బ్యాంకుకి, పేమెంట్స్ బ్యాంకుకి మధ్య తేడా

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) సెప్టెంబర్ 1 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఐపీపీబీకి దేశ వ్యాప్తంగా మొత్తం 650 జిల్లాల్లో 3250 కేంద్రాలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరికల్లా దేశంలోని మొత్తం 1,55,000 పోస్ట్ ఆఫీసులను ఐపీపీబీ వ్యవస్థతో అనుసంధానించే అవకాశం ఉంది.

Published : 16 Dec 2020 18:46 IST

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) సెప్టెంబర్ 1 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఐపీపీబీకి దేశ వ్యాప్తంగా మొత్తం 650 జిల్లాల్లో 3250 కేంద్రాలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరికల్లా దేశంలోని మొత్తం 1,55,000 పోస్ట్ ఆఫీసులను ఐపీపీబీ వ్యవస్థతో అనుసంధానించే అవకాశం ఉంది.

సాధారణ బ్యాంకుకి, పేమెంట్స్ బ్యాంకు కి మధ్య తేడాలను కింద తెలుసుకుందాం.

పేమెంట్స్ బ్యాంకు:

పేమెంట్స్ బ్యాంకులు లైసెన్స్ ను పొందడానికి రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. ఆర్థిక చేరికలను పెంపొందించడం పేమెంట్స్ బ్యాంకు ప్రధాన లక్ష్యం. దీనిని సాధించడానికి చిన్న పొదుపు ఖాతాలను అందించడం, చెల్లింపులు, అలాగే వలస కార్మికులకు, తక్కువ ఆదాయం పొందే వారికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఇతర అసంఘటిత రంగ సంస్థలకు, ఇతర వినియోగదారులకు చెల్లింపు సేవలను అందించాల్సి ఉంటుంది.

ఆగష్టు 2015 సంవత్సరంలో, భారతదేశంలో 11 పేమెంట్స్ బ్యాంకులకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. వీటిలో మొదటగా ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ప్రారంభమైంది. ప్రస్తుతం పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, ఫినో పేమెంట్స్ బ్యాంకు, ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. జనవరి 2017లో ఐపీపీబీ రెండు శాఖలలో తన కార్యకలాపాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది.

రెండిటి మధ్య తేడా?

పొదుపు ఖాతాలను, పేమెంట్ సేవలను అందించడం ద్వారా పేమెంట్స్ బ్యాంకు మరింత ఆర్ధిక చేరికను లక్ష్యంగా పెట్టుకుంది. రుణాన్ని మంజూరు చేయడానికి లేదా క్రెడిట్ కార్డును జారీ చేయడానికి పేమెంట్ బ్యాంకుకు అనుమతి లేదు.

పొదుపు ఖాతాల విషయంలో కూడా పేమెంట్ బ్యాంకు కొన్ని పరిమితులను కలిగి ఉంటుంది. వినియోగదారుడు గరిష్టంగా ఒక రూ. లక్ష డిపాజిట్ తో పొదుపు ఖాతాను తెరవగలడు. ప్రస్తుతం ఈ బ్యాంకులు రెగ్యులర్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లనే అందిస్తున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, పేమెంట్స్ బ్యాంకులు ఫిక్స్డ్ లేదా రికరింగ్ డిపాజిట్లను అనుమతించవు.

ఐపీపీబీ ఖాతాలు:

ఐపీపీబీ తన పొదుపు ఖాతాదారులకు 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే తమ ఖాతాదారులకు ఇంటి వద్దకే సేవలను అందిస్తుంది. ఈ ఖాతాను ఎలాంటి రుసుమును చెల్లించకుండా, ఉచితంగా తెరవవచ్చు. కానీ నగదు లావాదేవీలకు రూ. 25 (జీఎస్టీ తో కలిపి), అలాగే నగదు రహిత లావాదేవీలకు రూ. 15 (జీఎస్టీ తో కలిపి) రుసుమును వసూలు చేస్తారు.

అంతేకాకుండా, ఐపీపీబీ ఖాతాదారులకు క్యూఆర్ కార్డ్ ను ఒక బిన్నమైన క్యూఆర్ కోడ్ తో జారీ చేస్తారు. కార్డు ద్వారా లావాదేవీలు చేయడానికి ఖాతాదారుడి బయో మెట్రిక్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. బిల్లు చెల్లింపులు, నగదు రహిత కొనుగోళ్లు, నగదు బదిలీ లాంటి లావాదేవీలకు ఈ కార్డును వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకోవడం కుదరదు. ప్రస్తుతం ఐపీపీబీ తమా వినియోగదారులకు ఏటీఎం లేదా డెబిట్ కార్డును అందించడం లేదు.

ప్రస్తుతం పొదుపు ఖాతాదారులకు కూడా చెక్కు బుక్ సౌకర్యాన్ని ఐపీపీబీ అందించడం లేదు. కేవలం కరెంటు ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించింది.

ఐపీపీబీ ఖాతాదారులు నగదు నిల్వను తనికీ చేసుకోడానికి, స్టేట్ మెంట్, బిల్లు చెల్లింపులు, నగదు బదిలీ చేయడానికి మొబైల్ యాప్ ను కూడా వినియోగించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని