Digital Rupee: డిజిటల్‌ రూపీని నగదుగా మార్చుకోవచ్చు: మోదీ

త్వరలోనే ప్రభుత్వం దేశీయ డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. కాగా.. ఈ డిజిటల్‌ రూపీని నగదుగా మార్చుకోవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా వెల్లడించారు. బుధవారం దిల్లీలో

Published : 02 Feb 2022 21:16 IST

దిల్లీ: త్వరలోనే ప్రభుత్వం దేశీయ డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. కాగా.. ఈ డిజిటల్‌ రూపీని నగదుగా మార్చుకోవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా వెల్లడించారు. బుధవారం దిల్లీలో భాజపా నిర్వహించిన ‘ఆత్మనిర్భర అర్థవ్యవస్థ’పై చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. 

‘‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(డిజిటల్‌ రూపీ)’ అనేది భౌతిక రూపాయికి డిజిటల్‌ రూపం. దీన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నియంత్రిస్తుంది. ఈ డిజిటల్‌ రూపీని నగదుగా మార్చుకునే వీలుంటుంది. ఎవరైనా మీకు డిజిటల్‌ రూపీల్లో చెల్లింపులు జరిపితే.. దాన్ని మీరు నగదుగా మార్చుకోవచ్చు. దీని వల్ల రానున్న కాలంలో డిజిటల్‌ ఎకానమీ మరింత బలోపేతమవుతుంది. ఫిన్‌టెక్‌ రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి’ అని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్‌ రూపీతో లావాదేవీలు సురక్షితమని, ఇది అంతర్జాతీయ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ చర్చా  కార్యక్రమంలో భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని