Disney India: డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ముకేశ్‌ అంబానీ!

Disney India sale: వాట్‌ డిస్నీ సంస్థ డిస్నీ ఇండియా వ్యాపారాన్ని విక్రయించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ రేసులో రిలయన్స్‌ కూడా ఉండడం గమనార్హం.

Updated : 19 Sep 2023 05:59 IST

Disney India sale- Reliance | ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వాల్ట్‌ డిస్నీ తన భారత వ్యాపారం డిస్నీ ఇండియా (Disney India) విక్రయించాలని చూస్తోందని సమాచారం. టెలివిజన్‌ సహా స్ట్రీమింగ్‌ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించేందుకు పలువురు కొనుగోలుదారులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రేసులో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ+ హాట్‌స్టార్‌, స్పోర్ట్స్‌ హక్కులను సైతం ఒకేసారి విక్రయించాలని ఆ కంపెనీ భావిస్తోందని తెలిసింది. 

ఐపీఎల్‌కు సంబంధించిన స్ట్రీమింగ్‌ రైట్స్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 ఈ హక్కులను దక్కించుకుంది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రైబర్లు తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డిస్నీ ఇండియా వ్యాపార విక్రయానికి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

LIC ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలేవీ డీల్‌ వరకు వెళ్లకపోవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై స్పందించేందుకు డిస్నీ ప్రతినిధి నిరాకరించారు. రిలయన్స్‌ అధికార ప్రతినిధి మాత్రం వచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు కంపెనీ మదింపు చేస్తుందని, అవసరం అయినప్పడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్‌ వ్యాపారానికి సంబంధించి డిజిటల్‌ హక్కులు కోల్పోయినప్పటికీ.. టీవీ హక్కులు మాత్రం 2027కు సంపాదించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని