నరేశ్‌ గోయల్‌కు చెందిన రూ.538 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్‌

Naresh Goyal: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌కు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఇప్పటికే ఈడీ ఆయన్ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Published : 01 Nov 2023 17:47 IST

దిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు (Naresh Goyal) మరో షాక్‌ తగిలింది. ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు భారత్‌ సహా లండన్‌, దుబాయ్‌లో ఉన్న రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అటాచ్‌ చేసింది. బ్యాంకును మోసగించిన కేసులో భాగంగా మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఈ మేరకు తాజాగా చర్యలు చేపట్టింది. జప్తు చేసిన వాటిలో 17 రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు, బంగ్లాలు, వాణిజ్య ప్రదేశాలు ఉన్నాయి.

UPI: వెయ్యికోట్ల UPI లావాదేవీలు.. వరుసగా మూడోసారి

కెనరా బ్యాంక్‌ను మోసగించిన కేసులో నరేశ్‌ గోయల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను వ్యక్తిగత అవసరాలకు, ప్రైవేటు రుణాలు తీర్చేందుకు వినియోగించారన్న ఆరోపణలను గోయల్‌ ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్‌ 1న ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. మంగళవారం నరేశ్‌ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ.. తాజాగా కొన్ని ఆస్తులను జప్తు చేసింది. జెట్‌ ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు గోయెల్‌, ఆయన భార్య అనిత, కుమారుడు నివాన్‌ పేరిట ఈ ఆస్తులు ఉన్నాయని ఈడీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని