ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల‌లోనూ కొంత పెట్టుబ‌డి

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్ట‌బ‌డులు చేసే త‌మ పెట్టుబ‌డుల‌లో కొంత భాగాన్నిప్యాసివ్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం గురించి ప‌రిశీలించ‌వ‌చ్చు......​

Published : 19 Dec 2020 14:13 IST

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్ట‌బ‌డులు చేసే త‌మ పెట్టుబ‌డుల‌లో కొంత భాగాన్నిప్యాసివ్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం గురించి ప‌రిశీలించ‌వ‌చ్చు.​​​​​​​

పెట్టుబ‌డి చేయాల‌నుకునే వారు కొంత భాగం ప్యాసివ్ ఫండ్లు ఇండెక్స్ ఫండ్లు ఈటీఎఫ్ ల్లో కూడా చేయ‌డం గురించి ప‌రిశీలించ‌వ‌చ్చు. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేద్దామ‌నుకునే మ‌దుప‌ర్లు పెట్టుబ‌డుల‌లో కొంత భాగం నిష్ర్కియగా (ప్యాసివ్) ఫండ్లో మ‌దుపు చేయ‌డం మంచిది. ఎందుకంటే వీటిలో నిర్వ‌హ‌ణ ర‌సుము త‌క్కువ‌గా ఉంటుంది. యాక్టివ్ ఫండ్లతో పోలిస్తే నిర్వ‌హ‌ణ రుసుము సుమారు 1 శాతం త‌క్కువ‌గా ఉంటుంది. వీటిలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా వైవిధ్య‌త ఎక్కువ‌గా పొంద‌వ‌చ్చు. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాల‌నుకునే వారు కొంత భాగం ప్యాసివ్ ఫండ్లు ఇండెక్స్ ఫండ్లు ఈటీఎఫ్ ల్లో కూడా చేయ‌డం మంచిది. సాధార‌ణంగా నిష్ర్కియ అన‌గానే గుర్తొచ్చేది ఈటీఎఫ్ లు, ఇండెక్స్ ఫండ్లు. వీటిని ప్యాసివ్ ఫండ్లు అని ఎందుకంటారంటే ఏదైనా ఒక ఇండెక్స్ అనుక‌రించి పెట్టుబ‌డులు చేస్తుంటాయి. మ‌దుప‌ర్లు లావాదేవీలు త‌ర‌చూ చేయ‌కుండా ఒక సారి పెట్టుబ‌డి చేసి దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగించ‌డం ద్వారా మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.

కొన్ని ఇండెక్స్ ఫండ్లు/ ఈటీఎఫ్‌లు కాల‌ప‌రిమ‌తి - రాబ‌డి (%) వివ‌రాలు:

indexfundslistdata.png

నిష్ర్కియ విధానం ద్వారా మ‌దుప‌ర్ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు:

ఈ విధానంలో ఫండ్ అనుక‌రించే సూచీ ఆధారంగా రాబ‌డి ఉంటుంది.మార్కెట్ సూచీలు నిఫ్టీ ,సెన్సెక్స్ లేదా ఇత‌ర రంగాల‌కు చెందిన సూచీల ఆధారంగా ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్ లు ప‌నిచేస్తాయి. మ‌న దేశానికి చెందిన సూచీల్లోనే కాకుండా విదేశీ మార్కెట్ల సూచీల్లోనూ పెట్టుబ‌డి చేయ‌డం ఈటీఎఫ్ ల‌తో సాధ్య‌మవుతుంది.

ప్యాసివ్ ఫండ్ల ఉద్దేశం మార్కెట్ సూచీ కంటే ఎక్కువ రాబ‌డి ని పొంద‌డం కాదు ఆ సూచీకి ద‌గ్గ‌ర‌గా రాబ‌డి పొందడమే ల‌క్ష్యం. ఇండెక్స్ ఫండ్లు ఇతర యాక్టివ్ ఫండ్ల కంటే ఎక్కువ రాబ‌డిని అందిచిన సంద‌ర్భాలు కూడా మ‌నం చూడ‌వ‌చ్చు.

యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్ల ప్ర‌ధాన ఉద్దేశం ఇండెక్స్ ను మించి రాబ‌డి సాధించ‌డ‌మే. అయితే కొన్ని యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్లు ఇండెక్స్ ను మించి రాబ‌డి సాధించ‌లేక‌పోవ‌డం మ‌నం చూస్తున్నాం. ఫండ్ల నిర్వ‌హ‌ణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ల నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా ఏవిధ‌మైన షేర్లను ఎంపిక చేయ‌డం, ప‌రిశోధ‌న లాంటి లేకుండా, ఏదైనా ఒక ఇండెక్స్ అనుక‌రించి పెట్టుబ‌డులు చేస్తుంటారు కాబ‌ట్టి వీటిలో నిర్వ‌హ‌ణ రుసుం బాగా త‌గ్గుతుంది.
మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం, ల‌క్ష్యం ఆధారంగా ఈ విధానంలో పెట్టుబ‌డులు ఎంచుకోవాలి. ప్ర‌ధాన మార్కెట్ సూచీలైనా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఫండ్లు చేసే పెట్టుబ‌డికి న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. స్వ‌ల్ప‌కాలానికి వీటిలో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డినా దీర్ఘ‌కాలంలో వీటిపై మంచి రాబ‌డి ని పొంద‌వ‌చ్చు. ఎక్కువ మొత్తంలో రాబ‌డి సాధించే ఉద్దేశంతో కాకుండా దీర్ఘ‌కాలంలో స్థిరంగా ఉండి మంచి రాబ‌డి అందించేలా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని