GAIL: డివిడెండ్‌ చెల్లింపుల్లో గెయిల్‌ రికార్డు

గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది....

Updated : 13 Mar 2022 18:57 IST

దిల్లీ: గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో డివిడెండ్‌. డివిడెండ్‌ రూపంలో ఒక్కో షేరుకు రూ.5 చొప్పున మొత్తం రూ.2,220.19 కోట్లు వాటాదారులకు గెయిల్‌ చెల్లించనుంది. మార్చి 11న సమావేశమైన సంస్థ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాదిలో ఇప్పటికే ఓసారి ఒక్కో షేరుపై రూ.4 డివిడెండ్‌ను ప్రకటించింది. రెండు మధ్యంతర డివిడెండ్‌తో కలిసి మొత్తం ఒక్కో షేరుకు ఈ ఏడాది రూ.9 డివిడెండ్‌ చెల్లించింది. అంటే మొత్తం డివిడెండ్ల చెల్లింపులకు సంస్థ ఈ సంవత్సరం రూ.3,996.35 కోట్లు కేటాయించింది. గెయిల్‌ చరిత్రలో ఇంత మొత్తం డివిడెండ్‌ చెల్లించడం ఇదే తొలిసారని సంస్థ ఛైర్మన్‌, ఎండీ మనోజ్‌ జైన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వానికి సంస్థలో 51.54 శాతం వాటా ఉంది. ఈ లెక్కన సర్కార్‌కు డివిడెండ్‌ రూపంలో రూ.1,142.29 కోట్లు వెళ్లనున్నాయి. మిగిలిన రూ.1,077.90 కోట్లు ఇతర వాటాదారులకు పంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని