భారత్‌లో విక్రయాలు బాగుంటాయ్‌

భారత్‌పై చాలా ఆశావహ వైఖరితో ఉన్నామని ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు.

Published : 04 Feb 2023 01:48 IST

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌

న్యూయార్క్‌: భారత్‌పై చాలా ఆశావహ వైఖరితో ఉన్నామని ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే పెట్టుబడులు, రిటైల్‌, ఆన్‌లైన్‌ కార్యకలాపాల విస్తరణ ద్వారా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సంస్థ డిసెంబరు త్రైమాసికంలో  117.2 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదుచేసింది. 2021 డిసెంబరు త్రైమాసికంలో ఆర్జించిన 124 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది 5 శాతం తక్కువే. భారత్‌లో రికార్డు త్రైమాసిక ఆదాయాన్ని నమోదుచేశామని, ఏటా రెండంకెల వృద్ధి సాధిస్తున్నట్లు వెల్లడించారు. 2020లో భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌ తీసుకొచ్చామని, త్వరలో యాపిల్‌ రిటైల్‌ను ప్రారంభిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని