కార్పొరేట్‌ ‘పద్మాలు’ వీరే

వాణిజ్య -పరిశ్రమ రంగంలో నలుగురిని ‘పద్మ’ పురస్కారాలు వరించాయి. సీతారామ్‌ జిందాల్‌(కర్ణాటక), యాంగ్‌ లీ(తైవాన్‌)లకు పద్మభూషణ్‌; కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ(కర్ణాటక)లకు పద్మశ్రీ దక్కాయి.

Updated : 26 Jan 2024 13:46 IST

వాణిజ్య -పరిశ్రమ రంగంలో నలుగురిని ‘పద్మ’ పురస్కారాలు వరించాయి. సీతారామ్‌ జిందాల్‌(కర్ణాటక), యాంగ్‌ లీ(తైవాన్‌)లకు పద్మభూషణ్‌; కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ(కర్ణాటక)లకు పద్మశ్రీ దక్కాయి.

  • జిందాల్‌ అల్యూమినియం వ్యవస్థాపకుడు, సీఎండీ అయిన సీతారామ్‌ జిందాల్‌(91) హరియాణాలో జన్మించారు. నేచురోపతీలో డాక్టరేట్‌ డిగ్రీ ఉంది. బెంగళూరులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘నేచురోపతి అండ్‌ యోగా హాస్పిటల్‌’ను 1978లో నిర్మించారు.
  • తైవాన్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌కు సీఈఓ, ఛైర్మన్‌ అయిన యాంగ్‌ లీ, భారత్‌లో సెమీకండక్టర్‌ ప్రణాళికలకు సహకారం అందిస్తున్నారు.
  • కల్పనా మోర్పారియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేపీ మోర్గాన్‌లలో దీర్ఘకాలం పాటు పనిచేశారు. ప్రస్తుతం పలు కంపెనీల బోర్డుల్లో ఉన్నారు.
  • ఐజ్మో లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్న శశి సోని.. రూ.10,000తో మొదలుపెట్టి 500 మి.డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని