రెనో నుంచి 5 కొత్త వేరియంట్లు

ఫ్రెంచ్‌ వాహన తయారీ సంస్థ రెనో.. తన క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ మోడళ్లలో 5 కొత్త వేరియంట్లను మంగళవారం దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

Updated : 10 Jan 2024 09:51 IST

 ధరల శ్రేణి రూ.4.69-10.99 లక్షలు
మూడేళ్లలో విపణిలోకి 5 కొత్త కార్లు

దిల్లీ: ఫ్రెంచ్‌ వాహన తయారీ సంస్థ రెనో.. తన క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ మోడళ్లలో 5 కొత్త వేరియంట్లను మంగళవారం దేశీయ విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.4.69-10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). మరింతమంది వినియోగదార్లను ఆకట్టుకునేందుకు ఈ వేరియంట్లను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. దేశంలో వాహనాలకు గిరాకీ పెరుగుతున్నందున, వచ్చే మూడేళ్లలో మరో 5 కొత్త కార్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెడతామని రెనో ఇండియా ఆపరేషన్స్‌ కంట్రీ సీఈఓ, ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి వెల్లడించారు. ఇందులో సరికొత్త మోడళ్లతో పాటు కైగర్‌, ట్రైబర్‌లలో తదుపరి తరం వాహనాలు ఉంటాయని వివరించారు.

ఈ ఏడాది రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం: గత ఏడాది సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కోవడంతో విక్రయాలు తగ్గాయి. ఈ ఏడాది వ్యాపారం పుంజుకోవచ్చనే అభిప్రాయాన్ని వెంకట్రామ్‌ వ్యక్తం చేశారు. గత ఏడాది సంస్థ దేశీయ విపణిలో 49,000 వాహనాలను విక్రయించింది. 28,000 కార్లను అంతర్జాతీయ విపణికి ఎగుమతులు చేసింది. ఈ ఏడాది రెండంకెల వృద్ధిపై దృష్టి సారించామని, అందుకే ప్రస్తుత ఉత్పత్తుల శ్రేణిలో కొత్త వేరియంట్లు తీసుకొచ్చామని వెంకట్రామ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని