మహీంద్రా సరికొత్త ట్రక్కులు

మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) సరికొత్త ట్రక్కులను ఆవిష్కరించింది. ‘సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఎక్సెల్‌’ను డీజిల్‌, సీఎన్‌జీ డ్యుయో వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Updated : 19 Jan 2024 10:32 IST

డీజిల్‌, సీఎన్‌జీ విభాగాల్లో లభ్యం
ధర రూ.6.61-6.93 లక్షలు

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) సరికొత్త ట్రక్కులను ఆవిష్కరించింది. ‘సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఎక్సెల్‌’ను డీజిల్‌, సీఎన్‌జీ డ్యుయో వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.6.61-6.93 లక్షల మధ్య ఉన్నాయి. చిన్న వాణిజ్య వాహనాల(ఎస్‌సీవీ) విభాగంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ వృద్ధి కొనసాగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. పరిశ్రమ 5-10 శాతం మేర వృద్ధి చెందొచ్చని, అంత కంటే మెరుగ్గా తాము రాణిస్తామని మహీంద్రా ఆటో వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌ బనేశ్వర్‌ బెనర్జీ పేర్కొన్నారు. రాబోయే నెలల్లో పిక్‌-అప్‌ శ్రేణిలో ఎయిర్‌ కండిషనింగ్‌ మోడళ్లు తీసుకు రావాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. 2 టన్నుల్లోపు విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 22% క్షీణతను నమోదు చేయనుండగా.. మహీంద్రా మాత్రం 22% వృద్ధిని నమోదు చేయనుందని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని