విదేశీ బ్యాంకులపైపన్ను తగ్గింపు యోచన

భారత్‌లో విదేశీ బ్యాంకులు తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు వీలుగా పన్నులు తగ్గించాలన్న ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. భారతీయ బ్యాంకులకు సమానంగా పన్నులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే.

Published : 05 Dec 2021 02:36 IST

ఈనాడు, దిల్లీ: భారత్‌లో విదేశీ బ్యాంకులు తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు వీలుగా పన్నులు తగ్గించాలన్న ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. భారతీయ బ్యాంకులకు సమానంగా పన్నులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. విదేశీ బ్యాంకుల స్థానిక శాఖలపై పన్ను రేటు 15 శాతం వరకు తగ్గుతుంది. రాబోయే బడ్జెట్‌లో ఈ అంశంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ బ్యాంకులు 22 శాతం పన్ను (సర్‌ఛార్జీ, సెస్‌ అదనం) చెల్లిస్తున్నాయి. ఇదే సమయంలో విదేశీ బ్యాంకుల శాఖలపై 40 శాతం పన్ను (సర్‌ఛార్జీ, సెస్‌ అదనం) విధిస్తున్నారు. కార్పొరేట్‌ పన్ను రేటు కోతల కారణంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంకులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తోంది. గతంలో కార్పొరేట్‌ పన్ను వీటికి వర్తించకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం విదేశీ బ్యాంకులు తమ కార్యకలాపాలను అనుబంధ సంస్థలుగా మారిస్తేనే తక్కువ పన్ను రేటు పడే అవకాశం ఉంటుంది. అయితే నియంత్రణపరమైన, విధానపరమైన సంక్లిష్టతల కారణంగా కొన్ని విదేశీ బ్యాంకులు మాత్రమే ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని