8 మంది ప్రయాణించే వాహనాల్లో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు: గడ్కరీ

ప్రయాణికులకు వాహన భద్రతను మరింత పెంచేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 8 మంది వరకు ప్రయాణికులను తీసుకెళ్లే వీలున్న కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను  తప్పనిసరి చేయనుందని కేంద్ర మంత్రి

Published : 15 Jan 2022 04:44 IST

దిల్లీ: ప్రయాణికులకు వాహన భద్రతను మరింత పెంచేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 8 మంది వరకు ప్రయాణికులను తీసుకెళ్లే వీలున్న కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను  తప్పనిసరి చేయనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం తెలిపారు. 2019 జులై 1 నుంచి వాహన చోదకుడికి రక్షణ కల్పించేలా ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేశారు. 2022 జనవరి 1 నుంచి డ్రైవర్‌, డ్రైవర్‌ పక్కన సీటుకూ ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి అయ్యింది. తాజాగా ‘ఎనిమిది మంది వరకు ప్రయాణికులను తీసుకెళ్లే మోటార్‌ వాహనాల్లో భద్రతను పెంచడం కోసం కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయడానికి ముసాయిదా నోటిఫికేషన్‌కు అనుమతినిచ్చా’నని గడ్కరీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని