మారుతీ సెలెరియోలో ఎస్‌-సీఎన్‌జీ

సెలెరియో మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేసినట్లు మారుతీ సుజుకీ సోమవారం వెల్లడించింది. దీని ధర రూ.6.58 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) నిర్ణయించింది. కె-సిరీస్‌ 1.0 లీటర్‌ ఇంజిన్‌తో రూపొందిన

Published : 18 Jan 2022 02:18 IST

దిల్లీ: సెలెరియో మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేసినట్లు మారుతీ సుజుకీ సోమవారం వెల్లడించింది. దీని ధర రూ.6.58 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) నిర్ణయించింది. కె-సిరీస్‌ 1.0 లీటర్‌ ఇంజిన్‌తో రూపొందిన సరికొత్త సెలెరియోను ఎస్‌-సీఎన్‌జీ సాంకేతికతతో రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. కిలో సీఎన్‌జీతో 35.60 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని, సీఎన్‌జీ ట్యాంక్‌ సామర్థ్యం 60 లీటర్లు ఉంటుందని పేర్కొంది. ‘దేశంలో పర్యావరణ హిత ఇంధనాలతో నడిచే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, మేము కూడా ఈ రంగంలో బలోపేతం అయ్యేందుకు సెలెరియోలో ఎస్‌-సీఎన్‌జీ సాంకేతికత తీసుకొచ్చామ’ని మారుతీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని