
5,580 విద్యుత్ బస్సులకు రూ.5,500 కోట్ల టెండర్: సీఈఎస్‌ఎల్
హైదరాబాద్ సహా 5 నగరాల్లో
దిల్లీ: ప్రభుత్వ రంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్‌ఎల్) 130 డబుల్ డెక్కర్ మోడళ్లు సహా 5,580 విద్యుత్ బస్సుల సేకరణ కోసం రూ.5,500 కోట్ల టెండర్‌ను గురువారం ఆహ్వానించింది. విద్యుత్తు బస్సులకు సంబంధించి ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద టెండర్. విద్యుత్ బస్సులకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ‘గ్రాండ్ ఛాలెంజ్’ కింద ప్రతిపాదనల్ని ఆహ్వానించింది. ఈ ఛాలెంజ్ కింద తొలి దశలో హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, సూరత్, కోల్‌కతా నగరాల్ని ఎంపిక చేసుకుంది. తొలుత సమకూరే ఇ-బస్సులు ఈ ఏడాది జులై నాటికి రహదారులపై తిరుగుతాయని సీఈఎస్‌ఎల్ తెలిపింది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా 5,450 సింగిల్ డెక్కర్ బస్సులు, 130 డబుల్ డెక్కర్ బస్సుల్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఎస్‌టీయూలు, ఓఈఎంలు, ఫైనాన్షియర్లు, నీతి ఆయోగ్, డీహెచ్‌ఐ, మా సహచరులు.. చాలా మంది ఈ గ్రాండ్ ఛాలెంజ్ టెండర్ ఆహ్వానించడానికి కసరత్తు చేø
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.