5 లక్షల మంది మహిళావ్యాపారులకు చేయూత

దేశంలోని చిన్న తరహా వ్యాపారాలను నిర్వహిస్తున్న ఐదు లక్షల మంది మహిళలకు సహకారం అందించేందుకు ఫిక్కీతో మెటా (ఇంతకుమునుపు ఫేస్‌బుక్‌) భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చి షిమీన్స్‌బిజినెస్‌

Published : 29 Jan 2022 03:23 IST

ఫిక్కీతో మెటా భాగస్వామ్యం

దిల్లీ: దేశంలోని చిన్న తరహా వ్యాపారాలను నిర్వహిస్తున్న ఐదు లక్షల మంది మహిళలకు సహకారం అందించేందుకు ఫిక్కీతో మెటా (ఇంతకుమునుపు ఫేస్‌బుక్‌) భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చి షిమీన్స్‌బిజినెస్‌ ప్రోగ్రామ్‌ కింద ఈ సహకారాన్ని అందించనుంది. వివిధ రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు సహకారం అందించేందుకు అవసరమైన చర్యలపై నేషనల్‌ వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సును నిర్వహించిన మెటా ఈ ప్రకటన చేసింది. రుణాలు ఎలా పొందాలి.. ఏయే డిజిటల్‌ పద్ధతులను అనుసరించాలనే విషయంలో మహిళా వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని మెటా తెలిపింది. దేశంలో 6.3 కోట్ల చిన్న వ్యాపార సంస్థలుంటే, ఇందులో 20 శాతాన్ని మహిళలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ విభాగంలో లింగ అసమానతలను తగ్గించాల్సి ఉందని వివరించింది. ఫేస్‌బుక్‌ బిజినెస్‌ కోచ్‌, గ్రో యువర్‌ బిజినెస్‌ హబ్‌, మెటా కామర్స్‌ పార్ట్‌నర్స్‌ ప్రోగ్రామ్‌.. ఇలా మూడు విధానాల ద్వారా మెటా సహకారం అందించనుందని తెలిపింది. సామాజిక మాధ్యమాల ప్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్‌ విధానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల చాలా కంపెనీలు వృద్ధి చెందడమే కాకుండా విజయవంతం అయ్యాయని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రి నారాయన్‌ రాణే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని