Gift: శిక్షకుడు, పనివాళ్లు, చోదకుడికి..రూ.3.95 కోట్ల షేర్ల బహుమానం

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ వైద్యనాథన్‌ రూ.3.95 కోట్లకు పైగా విలువైన 9 లక్షల బ్యాంక్‌ షేర్లను తనకు సహాయకులుగా వ్యవహరిస్తున్న అయిదుగురికి బహుమానంగా అందించారు. ఇందులో తన శిక్షకుడు (ట్రైనర్‌), పనివాళ్లు, చోదకుడు ఉన్నారు.

Updated : 22 Feb 2022 07:33 IST

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఉదారత

దిల్లీ: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ వైద్యనాథన్‌ రూ.3.95 కోట్లకు పైగా విలువైన 9 లక్షల బ్యాంక్‌ షేర్లను తనకు సహాయకులుగా వ్యవహరిస్తున్న అయిదుగురికి బహుమానంగా అందించారు. ఇందులో తన శిక్షకుడు (ట్రైనర్‌), పనివాళ్లు, చోదకుడు ఉన్నారు. వీరెవరికీ ఈ ప్రైవేటు రంగ బ్యాంక్‌తో ఎలాంటి సంబంధం లేదు.

* శిక్షకుడు రమేశ్‌ రాజుకు 3 లక్షల షేర్లు, ఇంటి పనిలో సాయం చేసే ప్రంజల్‌ నర్వేకర్‌కు 2 లక్షల షేర్లు, చోదకుడు అల్గార్‌సామి సి.మునాపర్‌కు 2 లక్షల షేర్లు, కార్యాలయ సిబ్బంది దీపక్‌ పథారేకు లక్ష షేర్లు, ఇంటి పనిలో సాయం చేసే మరో వ్యక్తి సంతోష్‌ జోగలేకు లక్ష షేర్లు బహుమానంగా అందించారు. బీఎస్‌ఈలో సోమవారం షేరు ముగింపు ధర రూ.43.90 ప్రకారం, ఈ 9 లక్షల షేర్ల విలువ రూ.3,95,10,000గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని