బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభంలో 142% వృద్ధి

మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం 142.31 శాతం పెరిగి రూ.606 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,155.53 కోట్ల

Published : 25 May 2022 04:12 IST

దిల్లీ: మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం 142.31 శాతం పెరిగి రూ.606 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,155.53 కోట్ల నుంచి పెరిగి రూ.11,443.46 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,936 కోట్ల నుంచి 35.77 శాతం పెరిగి రూ.3,986 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.01% నుంచి 2.58 శాతానికి మెరుగయ్యింది. స్థూల నిరర్థక ఆస్తులు 13.77%(రూ.56,535 కోట్లు) నుంచి 9.98 శాతానికి (రూ.45,605 కోట్లు) తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 3.35%నుంచి తగ్గి 2.34 శాతానికి పరిమితమయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బీఓఐ నికర లాభం రూ.2,160 కోట్ల నుంచి 57.60% అధికమై రూ.3,405 కోట్లకు చేరింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.2 డివిడెండు చెల్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు