ఐఎస్‌బీకి అగ్రస్థానం

ద ఎకనామిస్ట్‌ 2022, ఫుల్‌టైమ్‌ ఎంబీఏ ర్యాంకింగ్‌ 2022 లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆసియా దేశాల్లో 5వ స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా 75వ స్థానంలో ఐఎస్‌బీ నిలిచింది. ఐ

Published : 24 Jun 2022 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: ద ఎకనామిస్ట్‌ 2022, ఫుల్‌టైమ్‌ ఎంబీఏ ర్యాంకింగ్‌ 2022 లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆసియా దేశాల్లో 5వ స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా 75వ స్థానంలో ఐఎస్‌బీ నిలిచింది. ఐఎస్‌బీ నిర్వహిస్తున్న పీజీపీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌) 2021 బ్యాచ్‌, 2022 బ్యాచ్‌ విద్యార్థులను సర్వే చేసి, ఈ ర్యాంకులను ‘ద ఎకనామిస్ట్‌’ నిర్ధారించింది. వినూత్న విద్యా విధానాలను అనుసరించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ ప్రొఫెసర్‌ రామభద్రన్‌ తిరుమలై అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని