పసిడి ప్రతికూల ధోరణిలో!

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.51,040 కంటే పైన చలించకుంటే ప్రతికూల ధోరణిలో కదలాడొచ్చు. రూ.50,304 స్థాయిపైనా ఓ కన్నేసి ఉంచాలి. ఇంతకంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింత దిద్దుబాటు కావచ్చు.

Published : 27 Jun 2022 03:24 IST
కమొడిటీస్‌
ఈ వారం
బంగారం

సిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.51,040 కంటే పైన చలించకుంటే ప్రతికూల ధోరణిలో కదలాడొచ్చు. రూ.50,304 స్థాయిపైనా ఓ కన్నేసి ఉంచాలి. ఇంతకంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింత దిద్దుబాటు కావచ్చు. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.51,250 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.51,040- రూ.50,888 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జులై కాంట్రాక్టు రూ.14,157 కంటే దిగువన ట్రేడయితే రూ.14,156; రూ.14,031 వరకు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వచ్చు.


వెండి

* వెండి సెప్టెంబరు కాంట్రాక్టు కిందకు వస్తే రూ.58,978 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.58,258; రూ.57,537 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.62,167 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనినీ అధిగమిస్తే రూ.63,041; రూ.65,356 వరకు పెరగొచ్చు.


ప్రాథమిక లోహాలు

* రాగి జులై కాంట్రాక్టు రూ.671 కంటే దిగువన ట్రేడయితే.. ప్రతికూల ధోరణి కొనసాగొచ్చు. ఒడుదొడుకులకు వీలుంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.668 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.709 లక్ష్యంతో రూ.671 సమీపంలో కొనుగోలు చేయొచ్చు.

* సీసం జులై కాంట్రాక్టు రూ.172.45 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే, రూ.168.65 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని కొనుగోళ్లకు మొగ్గు చూపాలి.

* జింక్‌ జులై కాంట్రాక్టు రూ.290 కంటే దిగువన ప్రతికూలంగా చలించొచ్చు. రూ.301.65 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.290 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మేలే.

* అల్యూమినియం జులై కాంట్రాక్టును రూ.204 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.


ఇంధన రంగం

ముడి చమురు జులై కాంట్రాక్టు రూ.8,698 కంటే పైన కదలాడకుంటే.. రూ.8,090; రూ.7,888 వరకు పడిపోవచ్చు. ఒకవేళ రూ.8,698 కంటే పైన చలిస్తే రూ.8,822; రూ.9,025 వరకు వెళ్తుందని భావించవచ్చు.

* సహజ వాయువు జులై కాంట్రాక్టుకు రూ.533 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.628-522 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.


 వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జులై కాంట్రాక్టు రూ.7,440 కంటే దిగువన చలించకుంటే, రూ.7,841; రూ.7,928 వరకు పెరిగే అవకాశం ఉంది.

* జీలకర్ర జులై కాంట్రాక్టు రూ.20,595 వరకు దిద్దుబాటు కావచ్చు. అదేవిధంగా రూ.21,350 ఎగువన కాంట్రాక్టు మరింత రాణించొచ్చు.

* ధనియాలు జులై కాంట్రాక్టుకు అధిక స్థాయిల వద్ద కొంత అమ్మకాల ఒత్తిడికి అవకాశం ఉంటుంది. రూ.10,796 సమీపంలో కాంట్రాక్టుకు కొంత మద్దతు లభించవచ్చు. దీని కంటే కిందకు వస్తే రూ.10,508 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పైకి వెళితే కాంట్రాక్టుకు రూ.11,350 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.11,616 వరకు రాణించొచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని