- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
సెలవు రోజునా.. ఈఎంఐ
బ్యాంకు నుంచి నేరుగా వెళ్లే రుణ వాయిదాలు సాధారణంగా సెలవు రోజుల్లో బ్యాంకు నుంచి డెబిట్ కావు. కానీ, ఆగస్టు 1 నుంచి ఇది మారనుంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) ఇక నుంచి అన్ని రోజులూ పని చేస్తుందని ఆర్‌బీఐ జూన్‌లో వెల్లడించింది. కాబట్టి, ఈఎంఐ వాయిదా రోజు సెలవు దినం ఉన్నా బ్యాంకు నుంచి ఆ మొత్తం డెబిట్ అవుతుంది.
దీంతోపాటు.. సెలవు రోజు ఉన్నా.. వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివీ బ్యాంకులో జమ అవుతాయి. ఇప్పటికే నిర్ణీత తేదీ నాడు చెల్లింపు చేయాల్సిందిగా నాచ్ ధ్రువీకరణ ఇచ్చిన సందర్భాల్లో అదే తేదీన ఆ చెల్లింపులు జరిగిపోతాయి. టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల్లాంటి వాటికి సెలవు రోజునాడూ బ్యాంకు నుంచి ఆ మొత్తం వెళ్లిపోతుంది.
* ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలూ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి రూ.150 రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. రూ.25,000 వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్‌కు రూ.20 చెల్లించాలి.
వడ్డీ రేట్లు ఇలా...
గత కొంత కాలంగా బ్యాంకులు అందిస్తోన్న వివిధ రుణాల వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. దీంతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అగ్రశ్రేణి బ్యాంకుల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయన్న వివరాలు మీకోసం.. (వడ్డీ రేట్లు శాతాల్లో)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
-
India News
అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
-
Sports News
DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
-
Crime News
Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
-
Movies News
Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Balakrishna: నమ్మకంతో గెలిపిస్తే.. నీలిచిత్రాలు చూపిస్తారా?.. ఎంపీ మాధవ్‌పై బాలకృష్ణ ఫైర్
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు